పునర్నవి లైఫ్ లో మరొకరున్నారు : రాహుల్‌

2252
Rahul Comments On Punarnavi
Rahul Comments On Punarnavi

తెలుగు బిగ్ బాస్ షో మూడో సీజన్ లో విజేతగా రాహుల్ నిలిచాడు. దాంతో అతనికి చెప్పలేనంత క్రేజ్ వచ్చింది. పదేహేను వారాల పాటూ హౌస్ లో ఉండి.. ప్రేక్షకుల మనసు గెల్చుకున్నాడూ రాలు. మొత్తం 17 మంది కంటెస్టెంట్స్‌లో రాహుల్‌, శ్రీముఖి, బాబా భాస్కర్‌, వరుణ్‌ సందేశ్‌, అలీ రెజా మాత్రమే ఫైనల్స్‌కు చేరుకున్నారు. అత్యధిక ఓట్లు రాహుల్ వేసి అతన్ని విజేతను చేశారు. హోస్ట్ నాగార్జున, చిరంజీవి చేతుల మీదగా రాహుల్ రూ.50 లక్షల నగదు, ట్రోఫీని అందుకున్నాడు.

అయితే ఈ సీజన్ లో రాహుల్ కు యాంకర్ శ్రీముఖి గట్టి పోటీ ఇచ్చి.. రన్నరప్ గా నిలిచింది. అయితే ఈ షో లో పునర్నవి.. హౌస్ లో ఉన్నప్పుడు రాహుల్ తో క్లోజ్ గా ఉండేది. అండుకే వీరిద్దరు ఒకర్నొకరు ఇష్టపడినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై ఇప్పటికే పునర్నవి స్పందించి.. రాహుల్ తనకు మంచి ఫ్రెండ్ మాత్రమే అని తెలిపింది. తాజాగా రాహుల్ ఓ ఆంగ్ర మీడియాతో మాట్లాడారు. పునర్నవి గురించి, బిగ్ బాస్ హౌస్ గురించి తెలిపాడు. ’ట్రోఫి దక్కించుకోవడం నన్ను భావోద్వేగానికి లోను చేసింది. నా తల్లిదండ్రులు కూడా అక్కడే ఉన్నారు.

నన్ను విన్నర్ గా ప్రకటించినప్పుడు వారి కళ్లలోని ఫీలింగ్ నాకు చాలా హ్యాపీని ఇచ్చింది. నాకు ఓట్లు వేసి గెలిపించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. నాకు, పునర్నవికి మధ్య ఎలాంటి రిలేషన్ లేదు. ఆమె లైఫ్ లో మరో వ్యక్తి ఉన్నారు. పునర్నవి అంటే నాకు మంచి గౌరవం ఉంది. మేమిద్దరం మంచి ఫ్రెండ్స్. ఈ షో వల్ల నేను చాలా నేర్చుకున్నను. ఎలాంటి సందర్భంలో ఎలా మాట్లాడాలి అనేది బాగా అర్దం అయింది. రూ.50 లక్షలతో మా అమ్మానాన్నల కోసం మంచి ఫ్లాట్‌ కొంటాను’ అని రాహుల్‌ చెప్పుకొచ్చారు.

Loading...