మీ వ్యూస్ కోసం న‌న్ను చంపేస్తారా..?

220
Comedian sunil fire on social media
Comedian sunil fire on social media

సినీ న‌టుడు సునీల్ సోష‌ల్ మీడియాపై మండిప‌డ్డాడు. అదేంటి సునీల్ ఎప్పుడు కూల్‌గా ఉంటాడు క‌దా అలా ఎందుకు చేశాడ‌ని మీరు అనుకుంటున్నారా..? దీనికి కార‌ణం లేక‌పోలేదు. సునీల్ రోడ్డు ప్ర‌మాదంలో మ‌ర‌ణించాడ‌ని సోష‌ల్ మీడియాలో ఓ వార్త శుక్ర‌వారం హ‌ల్ చ‌ల్ చేసింది. సునీల్ రోడ్డు ప్ర‌మాదంలో మ‌ర‌ణించాడ‌ని కొన్ని వైబ్‌సైట్స్ కూడా వార్త‌లు రాశాయి. కాని ఇది ఫేక్ వార్త అని నేను బాగానే ఉన్నాన‌ని ,తను క్షేమంగా ఉన్నట్లు చెప్పారు. ఇక ఈ సంద‌ర్భంగా ఆయ‌న మీడియాపై ఫైర్ అయ్యారు.

మీ వ్యూస్ కోసం ఇలా క‌ట్టుక‌థ‌లు రాసి మ‌నిషి జీవితాల‌తో ఆడుకుంటారా అని మీడియాను సునీల్ ప్ర‌శ్నించారు. ఇలాంటి వార్త‌లు రాయాడానికి మీకు సిగ్గు లేదా అంటూ ఫైర్ అయ్యారు. సునీల్ అభిమానులు ఇలాంటి వందతులు పుట్టిస్తున్న వారిని శిక్షించాలని, వెబ్ సైట్ పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.ఇక సునీల్ సినిమా కెరీర్‌కు వ‌స్తే సునీల్ ఇటీవ‌లే హీరో నుంచి తిరిగి క‌మెడియ‌న్‌గా మారి సినిమాలు చేస్తున్నాడు. ఇప్పుడు సునీల్ వ‌రుస సినిమాల‌తో ఫుల్ బిజీగా ఉన్నాడు.