విద్య 100% బుద్ధి 0% మూవీ టీజ‌ర్‌

127
Viday 100% buddi 0% movie teaser release
Viday 100% buddi 0% movie teaser release

సినిమాలో కొత్తద‌నం ఉండలే కాని తెలుగు ప్రేక్ష‌కులు ఎప్పుడు ఆద‌రిస్తార‌ని చాలాసార్లు నిరుపించారు. దీనికి సాక్ష్యాలే అర్జున్ రెడ్డి, ఆర్ఎక్స్ 100 సినిమాలు. ఈ రెండు సినిమాలు చిన్న బ‌డ్జెట్‌తో తెర‌కెక్కి భారీ హిట్లు కొట్టిన సంగ‌తి అంద‌రికి తెలిసిందే. తాజాగా ఇలాంటి సినిమానే మ‌రోక‌టి ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. క‌న్న‌డ‌లో ఘ‌న విజ‌యం సాధించిన 1st ర్యాంక్ రాజు సినిమాను విద్య 100% బుద్ధి 0% పేరుతో తెలుగులో రీమేక్ చేశారు. తాజాగా ఈ సినిమా టీజ‌ర్‌ను డైరెక్ట‌ర్ మారుతి విడుద‌ల చేశారు. ఈ సినిమాలో హీరోకు విద్య మాత్రం 100% ఉంటుంది కాని బుద్ధి మాత్రం 0%లో ఉంటుంది.

ఈ విష‌యాన్ని టైటిల్‌లోనే చెప్పేశారు చిత్ర ద‌ర్శ‌కుడు. మొదట్లో బాగానే ఉన్నా ఇతని అతి చదువు క్రమంగా ఇబ్బందులు తెచ్చి పెడుతుంది. మరి ఈ ఫస్ట్ ర్యాంక్ రాజు ఎలా జీవితంలో నెగ్గాడు అనేదే అసలు కథ. చ‌క్క‌ని క‌మెడీతో ఈ సినిమాను తెర‌కెక్కించిన‌ట్లు టీజ‌ర్‌ను చూస్తుంటే అర్థం అవుతోంది. ప్రకాష్ రాజ్-బ్రహ్మానందం-ప్రియదర్శి-వెన్నెల కిషోర్-రావు రమేష్-పోసానిలతో పాటు ఇటీవలే మా ప్రెసిడెంట్ గా ఎన్నికైన నరేష్ తండ్రి పాత్ర పోషించారు. సినిమాను వ‌చ్చే నెల‌లో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.