సైలెంట్‌గా నిశ్చితార్థం చేసుకున్న విశాల్‌

212
Tamil hero vishal engagement today in hyderabad
Tamil hero vishal engagement today in hyderabad

త‌మిళ స్టార్ హీరో విశాల్ పెళ్లికి రెడీ అయ్యాడు. విశాల్ హైద‌రాబాద్‌కు చెందిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటున్న సంగ‌తి అంద‌రికి తెలిసిందే. హైదరాబాద్ కి చెందిన అనీషా అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడు విశాల్‌. అనీషా సినిమాల్లో కూడా న‌టించింది. విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన అర్జున్ రెడ్డి సినిమాలో ఓ కీల‌క పాత్ర‌లో న‌టించింది. ఈ సినిమా తరువాత పెద్ద‌గా సినిమాల్లో క‌నిపించ‌లేదు అనీషా. అయితే వీరిద్ద‌రి నేడు నిశ్చితార్థం జ‌రిగింది.

అతి కొద్దిమంది బంధువుల స‌మ‌క్షంలో ఈ ఫంక్ష‌న్ జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. విశాల్- అనీషా ఫ్యామిలీలు మాత్ర‌మే ఈ నిశ్చితార్థ‌నికి హాజ‌రైన‌ట్లు స‌మాచారం. ఈరోజే పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేసి అధికారికంగా ప్రకటించే ఛాన్స్ ఉంది. వీరి పెళ్లి కూడా హైదరాబాద్ లోనే జరుగుతుంది. వెడ్డింగ్ రిసెప్షన్ మాత్రం చెన్నైలో ఏర్పాటు చేయాలని చూస్తున్నారు.ఇక విశాల్ ప్ర‌స్తుతం టెంప‌ర్ రీమేక్‌లో న‌టిస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్‌గా రాశి ఖన్నా హీరోయిన్‌గా న‌టిస్తుంది.