Saturday, April 20, 2024
- Advertisement -

ఎన్టీఆర్ బ‌యోపిక్ నుంచి రెండో సాంగ్‌

- Advertisement -

నంద‌మూరి తార‌క రామారావు జీవిత క‌థ‌ను సినిమాగా తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసింది.ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర‌ను ఆయ‌న త‌న‌యుడు హీరో బాల‌కృష్ణ పోషిస్తున్నారు.బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా విడుద‌ల ద‌గ్గ‌ర ప‌డుతున్న ద‌గ్గ‌ర నుంచి సినిమా ప్ర‌మోష‌న్స్ స్పీడ్ పెంచింది సినిమా యూనిట్‌.ఇప్ప‌టికే విడుద‌ల చేసిన మొద‌ట పాట‌కు మంచి స్పంద‌న వ‌చ్చింది.

తాజాగా రెండో పాట‌ను విడుద‌ల చేశారు.’రాజర్షి’ అనే మరో పాటను విడుదల చేసింది చిత్రబృందం. ఎక్కువగా సంస్కృత పదాలతో సాగిన ఈ పాటకు శివ దత్త, రామకృష్ణ, కీరవాణిలు సాహిత్యం అందించగా.. శరత్ సంతోష్, మోహన భోగరాజు, కీరవాణి, కాల భైరవ, శ్రీనిధి తిరుమలలు ఆలపించారు.ఈ సినిమాలో చంద్రబాబునాయుడు పాత్రలో రానా, శ్రీదేవి పాత్రలో రకుల్, ఎన్టీఆర్ భార్య బసవతారకం పాత్రలో విద్యాబాలన్,హరికృష్ణ పాత్రలో కళ్యాణ్ రామ్, అక్కినేని నాగేశ్వరావుగా సుమంత్ లు కనిపించనున్నారు. ఇక ఈ బ‌యోపిక్‌ను సంక్రాంతికి విడుద‌ల చేయ‌నున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -