Wednesday, April 17, 2024
- Advertisement -

త్రివిక్రమ్ ని కాకా పడుతున్న తమిళ హీరో

- Advertisement -

తమిళ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం తన తదుపరి చిత్రానికి సంబందించిన విడుదల ప్రచార కార్యక్రమాల్లో బిజీగా గడుపుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. అయితే తాజా పరిణామాల దృష్ట్యా సూర్య మీద తెలుగు సినిమా చేయాలనే ఒత్తిడి చాలా ఉంది అని తెలుస్తుంది. ఎప్పటి నుంచో సూర్య తెలుగు సినిమా చేస్తాను అని చెప్తున్నా కానీ అది నేటి వరకు జరగలేదు. అయన హైదరాబాద్ ఎప్పుడు వచ్చినా మీడియా ఆయనని ఈ ప్రశ్న అడగకుండా ఆగడం లేదు. అయితే ఆయన దీని పై స్పందిస్తూ, త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఒక కథ గురించిన చర్చలు చేస్తున్నాను అని చెప్పారు.

“నేను ఇంతకు ముందే త్రివిక్రమ్ గారి తో సినిమా చేయాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వలన ఆ సినిమా చేయడం కుదరలేదు. కానీ నేను ఆయన తో ఇంకా టచ్ లో నే ఉన్నాను.త్వరలో నే నేను ఆయనతో సినిమా చేస్తాను.” అని చెప్పాడు సూర్య. అయితే ప్రస్తుతం బన్నీ తో ఒక సినిమా చేయడం లో బిజీ గా ఉన్న త్రివిక్రమ్ ఈ కొత్త చిత్రం చేయడానికి ఎంత తీరిక ఉంటుంది అనే విషయం తెలియాల్సి ఉంది. ప్రస్తుతం సూర్య చేతిలో కూడా మూడు సినిమాలు ఉన్నాయి. మరి వీరు ఇద్దరు ఎప్పుడు ఖాళీ అవుతారో తెలియాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -