Tuesday, April 16, 2024
- Advertisement -

నిన్న ల‌వ్‌… ఈ రోజు బ్రేక‌ప్..?

- Advertisement -

సెల‌బ్రిటీలు జీవితాలు గురించి అంద‌రికి తెరచిన పుస్తుకం వంటిదే. ఎందుకంటే వారికంటు ర‌హ‌స్య‌లు ఏమి ఉండ‌వు. ఒక‌వేళ ఉన్న అవి ఎక్కువ కాలం దాగ‌వు. తాజాగా అలాంటిదే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్ర‌ద్ధా క‌పూర్ జీవితంలో జ‌రిగింది. రెండు రోజుల క్రితం శ్ర‌ద్ధా క‌పూర్ పెళ్లి గురించి ర‌కర‌కాల వార్తలు వ‌చ్చాయి. ప్ర‌ముఖ ఫొటోగ్రాఫర్‌ రోహన్‌ శ్రేష్ఠతో శ్ర‌ద్దా క‌పూర్ లవ్‌లో ఉంద‌ని రెండు రోజుల క్రితం వార్త‌లు వ‌చ్చాయి.

రోహన్‌ శ్రేష్ఠ, శ్ర‌ద్దా ఇద్ద‌రు చాలాకాలం నుంచి డేటింగ్ చేస్తున్నారని వీరి రిలేష‌న్‌షిప్ మ‌రో లెవ‌ల్‌కు వెళ్ల‌డంతో వీరిద్ద‌రు పెళ్లికి రెడీ అయ్యార‌ని వార్త‌లు వ‌చ్చాయి. పైగా శ్ర‌ద్ధా క‌పూర్ వ‌య‌స్సులో ఉన్న‌వారంద‌రు ఇప్ప‌టికే పెళ్లిల్లు చేసుకుని త‌మ వైవాహిక జీవితాన్ని హాయిగా గడుపుతుండ‌టంతో శ్ర‌ద్ధాను పెళ్లి చేసుకోవాలి వారి ఇంట్లో ఒత్తిడి చేస్తున్నార‌ట‌. వీరి పెళ్లికి రెండు కుటుంబాలు అంగీక‌రించాయని మీడియాలో వార్త‌లు వ‌చ్చాయి. దీంతో వీరి పెళ్లి త‌రువాయి అనుకున్న త‌రుణంలో ఓ షాకింగ్ వార్త బ‌య‌టికి వ‌చ్చింది. ప్రియుడు రోహన్‌ శ్రేష్ఠకు బ్రేక‌ప్ చెప్పింద‌ట శ్రద్ధా క‌పూర్.

కార‌ణలు తెలియ‌డం లేదు కాని వీరిద్ద‌రు మ‌ధ్య పెద్ద గొడ‌వ జ‌రిగింద‌ట‌. దీంతోనే వీరిద్ద‌రు విడిపోయార‌ని బాలీవుడ్ మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి. మొత్త‌నికి పెళ్లి అనుకున్న‌ది కాస్తా బ్రేక‌ప్ అయిందని బాలీవుడ్ జ‌నాలు చ‌ర్చించుకుంటున్నారు. ల‌వ్‌కు బ్రేక‌ప్ చెప్ప‌డంతో సినిమాల‌పై ఫోక‌స్ పెట్టింద‌ట శ్రద్ధా. ప్ర‌స్తుతం ఆమె చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. తెలుగులో కూడా న‌టిస్తోంది శ్ర‌ద్ధా. యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ సాహో సినిమాలో మెయిన్ హీరోయిన్‌గా న‌టిస్తోంది ఈ హాటీ బ్యూటీ.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -