Saturday, April 20, 2024
- Advertisement -

బిగ్‌బాస్‌లో మ‌ళ్లీ ఎన్టీఆర్‌ను చూడ‌బోతున్నామా..?

- Advertisement -

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ అటు వెండితెరతో పాటు బుల్లితెర మీద కూడా తాను ఏంటో నిరుపించుకున్నాడు. మొట్ట‌మొద‌టి తెలుగు రియాల్టీషో బిగ్‌బాస్ మొద‌టి సీజ‌న్‌కు యాంక‌ర్‌గా వ్య‌వ‌హరించాడు ఎన్టీఆర్‌. బిగ్‌బాస్ మొద‌టి సీజ‌న్‌కు అంత‌టి క్రేజ్ రావ‌డానికి కార‌ణం ఎన్టీఆర్ అనే చెప్పాలి. ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో ఓ షోకి యాంక‌రింగ్ చేస్తే ఎలా ఉంటుందో జ‌స్ట్ శాంపిల్ చూపించాడు. అయితే రెండో సీజ‌న్‌కు దూరం అయ్యాడు ఎన్టీఆర్‌.

త్రివిక్ర‌మ్‌తో అర‌వింద స‌మేత సినిమా ఉండ‌టం వ‌ల్ల బిగ్‌బాస్ రెండో సీజ‌న్‌కు దూరం అయ్యాడు. ఎన్టీఆర్ రెండో సీజ‌న్ దూరం అవ్వ‌డంతో , న్యాచుర‌ల్ స్టార్ నానిని వ్యాఖ్య‌త‌గా తీసుకున్నారు.రెండవ సీజన్ కు నాని హోస్ట్ గా వ్యవహరించడంను ప్రేక్షకులు పెద్దగా అంగీకరించినట్లుగా అనిపించలేదు. ఎన్టీఆర్ స్థాయిలో నాని మెప్పించలేక పోయాడనేది అందరు ఒప్పుకునే నిజం. ఇప్పుడు మూడో సీజ‌న్ వచ్చింది. మూడో సీజ‌న్‌కు యాంక‌రింగ్ చేయ‌నని ముందే చెప్పాడు నాని. దీంతో మ‌ళ్లీ యాంక‌ర్‌ను వెతికే ప‌నిలో ప‌డింది బిగ్‌బాస్ యాజ‌మాన్యం. వెంక‌టేశ్ , నాగ‌ర్జున వంటి హీరోల పేర్లు వినిపించిన అవి రూమ‌ర్లే అని తెలాయి.కొత్త‌వారిని వెతికే క‌న్నా మ‌ళ్లీ ఎన్టీఆర్‌నే ఒప్పించి , తీసుకుస్తే బాగుంటుంద‌ని భావిస్తుంద‌ట బిగ్‌బాస్ యాజ‌మాన్యం.

ఎన్టీఆర్ మూడో సీజ‌న్ చేస్తే షోకి మ‌రింత హైప్ రావ‌డం ఖాయం అని భావిస్తున్నారు. మ‌రి ఎన్టీఆర్ బిగ్‌బాస్ మూడో సీజ‌న్‌కు తిరిగి యాంక‌రింగ్ చేస్తాడే అంటే లేదు అనే మాట వినిపిస్తోంది. ఎన్టీఆర్ ప్ర‌స్తుతం RRR సినిమాలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్‌తో పాటు రామ్ చ‌రణ్ కూడా న‌టిస్తున్నాడు. ఈ సినిమాకు ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. రాజ‌మౌళి సినిమా అంటే క‌నీసం రెండు సంవ‌త్స‌రాలైన ప‌డుతోంది. మ‌రి ఇలాంటి ప‌రిస్థితుల‌లో ఎన్టీఆర్ బిగ్‌బాస్ చేయ‌డానికి స‌మ‌యం ఎక్క‌డ ఉంద‌ని ఆయ‌న అభిమానులు ప్ర‌శ్నిస్తున్నారు. దీనిని బ‌ట్టి బిగ్‌బాస్‌లో తిరిగి ఎన్టీఆర్‌ను చూడ‌టం క‌ష్ట‌మ‌నే చెప్పాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -