Thursday, March 28, 2024
- Advertisement -

‘ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌’లో ప‌రిటాల ర‌వి ఇతడే

- Advertisement -

రామ్ గోపాల్ వ‌ర్మ… వివాదాల‌కు మారు పేరు. కాంట్రవర్సీలతో సినిమాల‌ను పబ్లిసిటీ చేయ‌డంలో వ‌ర్మ త‌రువాతే ఎవ్వ‌రైన‌. ర‌క్త‌చ‌రిత్ర‌, వంగ‌వీటి, బెజ‌వాడ వంటి సినిమాలను తీసి తాను ఎంత కాంట్రవర్సీ వ్య‌క్తినో ప్రేక్ష‌కులకు తెలియ‌జేశాడు. తాజాగా వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న సినిమా ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌. ఎన్టీఆర్ రెండో భార్య ల‌క్ష్మి పార్వ‌తి ఆయ‌న జీవితంలోకి వ‌చ్చిన దగ్గ‌ర నుంచి ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నాడు వ‌ర్మ‌. ఎప్ప‌టిలాగే ఈ సినిమాకు కూడా వివాదల‌తో ప‌బ్లిసిటీని చేసుకున్నాడు వ‌ర్మ‌. సాంగ్స్ , పోస్ట‌ర్స్‌, ట్రైల‌ర్ ఇలా ప్ర‌తి దానిలో వ‌ర్మ మార్క్ క‌నిపించింది. తాజాగా ఈ సినిమాలోని ప‌రిటాల ర‌వి క్యారెక్ట‌ర్‌ను రీవిల్ చేశాడు వ‌ర్మ‌. ఎన్టీఆర్ కు అత్యంత నమ్మకస్తుడైన సన్నిహితుడిగా చెప్పుకునే పరిటాల పాత్రను పోషిస్తున్న నటుడు పేరు నరేంద్ర నాయుడు.

ఇత‌ను ఎవ‌రో పెద్ద‌గా తెలియ‌దు కాని , సినిమాలో ఇత‌ను క్యారెక్ట‌ర్‌కు చాలా ప్రాధన్య‌త‌ను ఇచ్చాడ‌ట వ‌ర్మ‌. ర‌క్త చ‌రిత్ర సినిమాలో ప‌రిటాల ర‌వి క్యారెక్ట‌ర్‌ను బాలీవుడ్ స్టార్ హీరో వివేక్ ఒబెరాయ్‌ను తీసుకున్న వ‌ర్మ‌, ఇప్పుడు ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో మాత్రం చిన్న న‌టుడిని తీసుకుని అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. ఇక ఈ సినిమాను బాల‌కృష్ణ న‌టించిన మ‌హ‌నాయ‌కుడు తరువాత విడుద‌ల చేస్తాన‌ని ప్ర‌క‌టించాడు వ‌ర్మ‌. బాల‌కృష్ణ న‌టించిన మ‌హ‌నాయ‌కుడు సినిమాను ఈ నెల 22న విడుద‌ల చేయ‌నున్నార‌న్న సంగ‌తి తెలిసిందే. ఇక ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను మార్చి 15న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -