Friday, April 19, 2024
- Advertisement -

శృతీ హాసన్.. ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవడానికి కారణం ఇదే..!

- Advertisement -

శృతీ హాసన్.. స్టార్ హీరో కమల్ హాసన్ కుమార్తె గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈమె కోలీవుడ్, టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఎన్నో హిట్ సినిమాల్లో నటించిన ఈ భామ.. గ్లామర్ తో కూడా ఆకట్టుకుంది. ఇక అద్భుతంగా డాన్స్ చేయడమే కాదు.. పాటలు కూడా ఈమె పాడుతోంది. ‘ఈనాడు’ అనే సినిమాకి సంగీత దర్శకురాలుగా కూడా శృతీ హాసన్ పని చేసింది.

ఇదంతా పక్కన పెడితే.. ఈమె కెరీర్ స్టార్టింగ్ లో ఉన్నప్పుడు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న విషయం చాలా మందికి తెలిసే ఉంటుంది. అయితే ఈ విషయాలను ఏ హీరోయిన్ డైరెక్ట్ గా చెప్పలేదు. కానీ శృతీ మాత్రం ఈ విషయంను మొహమాటం లేకుండా చెప్పేసింది. ఆమె మాట్లాడుతూ.. “నా ఫస్ట్ మూవీ టైములో నా ముక్కుకి గాయం అయ్యింది. దాంతో చూడడానికి అది అంత బాగుండేది కాదు. దాని కారణంగా నేను ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాను. ‘నా ఫేస్ చాలా వెస్ట్రన్ గా ఉందని, చాలా షార్ప్ గా ఉందని, నా ముక్కు వల్ల నేను మగాడిలా కనిపిస్తున్నానని’ .. ఇలా ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాను.

అలాంటి విమర్శలతో నేను చాలా ఒత్తిడికి గురయ్యాను. అందుకే ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాను. ఇది నా సొంత నిర్ణయం.నేను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న విషయాన్ని నేను కొన్నేళ్ళ క్రితమే తెలియజేశాను. ఎప్పుడూ దాచే ప్రయత్నం చెయ్యలేదు” అంటూ శృతీ హాసన్ అసలు విషయం చెప్పింది. శృతీ హాసన్ చెప్పినట్లు.. ఆమె పాత ఫోటోలతో చూస్తే.. ఇప్పుడే చాలా బాగుందని నెటిజన్లు కూడా అంటున్నారు.

శృంగారం కోసమే అమ్మాయిగా మారలేదు : జబర్దస్త్ సాయితేజ (పింకీ)

నలుగురు పెళ్లాళ్లో.. మూడు సుధీర్ కే : రోజా

‘కేజీఎఫ్ 2’ లో ‘అధీరా’ లుక్.. భయపెడుతున్న సంజయ్..!

సోనూసూద్ ఆస్తి ఎన్నికోట్లో తెలుసా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -