Saturday, April 20, 2024
- Advertisement -

శ్యామల మళ్లీ ప్రెగ్నెంటా ? పోస్ట్ వైరల్..!

- Advertisement -

బుల్లితెరపై అడపదడపా సీరియళ్లు, వంట ప్రోగ్రామ్స్, ఆడియో పంక్షన్లు చేసుకుంటూ వచ్చిన శ్యామలకు బిగ్ బాస్ ద్వారా మంచి క్రేజ్ వచ్చింది. బిగ్ బాస్ 2 వల్ల శ్యామకు పిన్ని గారు అంటూ నిక్ నేమ్ కూడా పడిపోయింది. గీతా మాధురి, శ్యామల, దీప్తి ఒక గ్యాంగ్ లా ఫామ్ అయ్యి.. ముచ్చట్లు పెట్టుకునేవారు. శ్యామల ఎలిమినేట్ అయినా.. మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది.

అయితే కౌశల్ ఆర్మీ సపోర్ట్ తోనే ఎంట్రీ ఇచ్చిందని.. అందుకే లోపలికి వెళ్లాక కూడా కౌశల్ కు మద్దతుగా మాట్లాడేదని అప్పట్లో తెగ రూమర్స్ వచ్చేవి. ఇదంత పక్కన పెడితే తాజాగా శ్యామల పెట్టిన ఓ పోస్ట్ వల్ల ఆమెకి తలనొప్పి స్టార్ట్ అయింది. మహిళ.. తల్లి కావడం అనేది ఓ గొప్ప అనుభూతి.. లైఫ్ లో ఎన్నో ఎత్తుపల్లాలు, నిద్ర లేని రాత్రులుంటాయి. కానీ ప్రతి రోజు ఏదో ఒకటి సాధించినట్లు ఫీల్ అవుతాము.

అందుకే ఈ ఆనంద క్షణాలను సెలబ్రేట్ చేసుకోవడానికి నా భర్త నరసింహ.. డైమండ్ బ్రాస్లెట్ కానుకగా ఇచ్చాడు. అయితే ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు.. మళ్లీ ప్రెగ్నెంట్ అయ్యారా అని ప్రశ్నలు కురిపించారు. అయితే అలాంటిదేమి లేదని.. అదొక ప్రకటనకు సంబంధించిన వివరణ అని చెప్పింది. కాకపోతే ఈ పోస్ట్ కొద్ది సేపట్లో వైరల్ అయింది. దాంతో శ్యామల ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అయింది.

https://www.instagram.com/p/B3rAKtzpwhR/?utm_source=ig_embed&utm_campaign=dlfix

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -