Friday, March 29, 2024
- Advertisement -

హలో… ఆడియో ఫంక్షనా… ప్రీ రిలీజ్

- Advertisement -

అక్కినేని నాగార్జున తన రెండో కుమారుడు అఖిల్ తర్వాతి చిత్రం విషయంలో కాస్త ఎక్కువగానే ఆలోచిస్తున్నాడు. మొదటి చిత్రం అలా బోల్తా కొట్టడంతో సెకండ్ వెంచర్ విషయంలో కాస్త శ్రద్ద చూపించాలనుకుంటున్నాడు. అందుకే హలో చిత్రానికి కూడా కాస్త ఎక్కువగానే హల్చల్ చేయాలనుకుంటున్నాడు. ఎందుకంటే మొదటి చిత్రం విజయం కాలేదు కాబట్టి సెకండ్ వెంచర్ మ్యాటర్ లో ఆ మాత్రం ఆత్రత ఉంటుంది కాదనలేం. కాని ఇపుడున్న టైమ్లో ఆడియో ఫంక్షన్ చేయడం ఎంత వరకు కరెక్ట్ అనేది కొందరు నాగ్ కు నూరుపోస్తున్నారట. ఎందుకంటే టాపర్లంతా ఈమధ్య ఆడియో ఈవెంట్ కు బదులు ప్రీ రిలీజ్ ఫంక్షన్ అనే పేరుతో ఓ ఈవెంట్ ను సింపుల్ గా చేసేసి చేతులు దులుపుకుంటున్నారు. కాని నాగ్ తన కుమారుడుకి బ్రేక్ రావాలనే ఉద్దేశ్యంతో అయిపోయిందనుకున్న కాన్సెప్ట్ ను మళ్లీ లైమ్ లైట్లోకి తీసుకువచ్చి… ఆడియో ఈవెంట్ జరిపితీరతాడని తెలుస్తుంది.

అక్కినేని అఖిల్ ‘హలో’ డిసెంబర్ 22న విడుదలకానుంది. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్ కు జనాల నుంచి రియాక్షన్ మంచిగా రావడంతో రెట్టించిన ఎనర్జీతో పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుతోంది సినిమా టీమ్. ఆడియో వేడుకను కూడా భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారని అది కూడా ఈ నెల 10వ తేదీన వైజాగ్లో ఈ వేడుక ఉంటుందని మేకర్స్ భావిస్తున్నారని ఫిల్మ్ సర్కిల్స్ లో రకరకాల రూమర్లు వినిపిస్తున్నాయి. బట్ ఈవిషయంపై అన్నపూర్ణ స్టూడియోస్ వర్గాలు ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం ఇవ్వలేదని తెలుస్తుంది.బహుశ నాగార్జున వైజాగ్ లో ఈవెంట్ జరిపితే దానికి ప్రీ రిలీజ్ పంక్షన్ అని పేరు పెట్టినా పెట్టొచ్చు.లేదంటే ఆడియో వైజాగ్ లోను…. ప్రీ రిలీజ్ హైదరాబాద్ లోను జరపొచ్చు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -