Thursday, April 25, 2024
- Advertisement -

బ‌య్య‌ర్ల‌కు భారీ న‌ష్టాలు మిగిల్చిన 2.O

- Advertisement -

సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్ న‌టించిన రోబో 2.0 గ‌త గురువారం విడుద‌లైన సంగ‌తి అంద‌రికి తెలిసిందే. భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన ఈసినిమాకు పాజిటివ్ టాక్ రావ‌డంతో త‌లైవా అభిమానులు సంబ‌రాలు చేసుకుంటున్నారు. సినిమా క‌లెక్ష‌న్లు అనౌన్స్ చేయ‌న‌ప్ప‌టికి వ‌సూళ్లు భారీగానే ఉన్న‌ట్లు సినీ విశ్లేషుకులు చెబుతున్నారు. ఇక ర‌జినీకాంత్‌కు తెలుగులో మంచి మార్కెట్ ఉండ‌టంతో ఇక్క‌డ కూడా మంచి క‌లెక్ష‌న్లు సాధించిందని తెలుస్తుంది.

అయితే ర‌జినీ మ్యానియా యూఎస్‌లో క‌నిపించ‌క‌పోవ‌డం గ‌మ‌న‌ర్హం. అమెరికాలో మాత్రం ‘2.0’ను నమ్ముకున్న బయ్యర్లు మునిగిపోయే పరిస్థితి కనిపిస్తోంది. అక్కడ ఈ చిత్రం ఆశించిన మేర వసూళ్లు రాబట్టట్లేదు. యుఎస్ లో సినిమాల విడుదలకు ఇది రాంగ్ టైమింగ్ అంటున్నారు. క్రిస్మస్ దగ్గర్లో రిలీజ్ చేస్తే బాగుండేదంటున్నారు. ‘2.0’ను అక్కడ సరిగా ప్రమోట్ కూడా చేయలేదు. పైగా హాలీవుడ్లో ఇలాంటి విజువల్ వండర్స్ చాలా కామన్ కావడం కూడా చేటు చేసినట్లుంది. ప్రిమియర్లు.. తొలి రోజు వసూళ్లు కలిపినా కూడా మిలియన్ డాలర్ మార్కును ‘2.0’ అందుకోలేకపోయింది. ‘బాహుబలి’కి దీటుగా భారీగా తెలుగు-తమిళం-హిందీ భాష్లో ‘2.0’ను రిలీజ్ చేశారు. వీకెండ్ అయ్యేసరికి ఈ చిత్రం 2.5 మిలియన్ డాలర్లు వసూలు చేయొచ్చని అంచనా వేస్తున్నారు. ఇంకా వ‌సూలు చేయాల్సింది చాలా ఉంద‌ని అంటున్నారు.సినిమా కొన్న బయ్య‌ర్ల‌కు భారీ న‌ష్టాలు వాటిల్లే అవ‌కాశం ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -