ర‌ష్మిక మంద‌నాకు వెరైటీ ప్రపోజల్‌

533
4 years boy love propose to rashmika mandanna
4 years boy love propose to rashmika mandanna

సోష‌ల్ మీడియా వ‌చ్చిన దగ్గ‌ర నుంచి సెల‌బ్రిటీలు సైతం సామాన్య‌లుగా మారిపోతున్నారు. అభిమానుల‌తో సెల‌బ్రిటీలు నేరుగానే మాట్లాడే అవ‌కాశం క‌ల్పించింది సోష‌ల్ మీడియా. దీని ద్వారా ఎవ‌రి అభిప్రాయాలు వారు బ‌హిరంగంగానే తెలియ‌జేస్తున్నారు. తాజాగా ఓ నాలుగేళ్ల కుర్రాడు హీరోయిన్ ర‌ష్మిక మందనా మీద త‌న‌కున్న ప్రేమ‌ను ట్విట్ట‌ర్ ద్వారా బ‌య‌య‌పెట్టాడు. ఏకంగా ర‌ష్మిక‌ను పెళ్లి చేసుకుంటాన‌ని చెప్పాడు ఈ బుడ‌తడు.నీ కన్నా పెద్దది కదా.. ఎలా చేసుకుంటావ్ రా బుడతా అంటే.. అదేం తెలియదు నాకు రష్మిక మందానా కావాలని ప‌ట్ట‌బుతున్నాడు.

ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మార‌డంతో బుడ్డోడి పెళ్లి ప్రపోజ్ రష్మికా మందనాకి వ‌ర‌కు వెళ్లింది. తాజాగా ఈ వీడియోపై స్పందించింది ర‌ష్మిక‌. ఈ నాలుగేళ్ల పిల్లాడికి సిగ్గుబాబు అని పెట్టింది ర‌ష్మిక‌. ఇంత‌కి ఆ వీడియోలో ఏమన్నాడో తెలుసా…ఈ వీడియోలో ఉన్న బాబు పేరు ప్ర‌తీ. నీకు ఎవ‌రిని పెళ్లి చేసుకోవాల‌ని ఉంది అని అడ‌గ్గా..మ‌రో మాట లేకుండా ర‌ష్మిక పేరు చెప్పాడు. ఓరేయ్ ఆమె నీక‌న్నా పెద్ద‌ది రా అంటే, స‌రే స‌మంత‌ను పెళ్లి చేసుకుంటాన‌ని చెబుతాడు. సమంతకి పెళ్లైపోయిందిరా అంటే.. అయితే రష్మికనే చేసుకుంటా,మీరెవరైనా రష్మికను చేసుకుంటా అంటే కొట్టేస్తా అంటూ ఈ బుడ‌త‌డు చెప్పే మాట‌లు అంద‌రిని ఆక‌ట్టుకుంటున్నాయి.