చిరు వర్సస్ బాలయ్య ఇష్యూపై ప్రకాష్ రాజ్ కామెంట్స్..!

1287
actor Prakash Raj On Balakrishna Statement Over Tfi Meeting
actor Prakash Raj On Balakrishna Statement Over Tfi Meeting

ఇటీవలే చిత్ర పరిశ్రమలో షూటింగ్ లపై ప్రభుత్వంతో సినీ పెద్దలు చిరంజీవి, నాగార్జున వంటివారు చర్చించారు. అయితే ఈ మీటింగ్ లకు బాలయ్యను పిలవలేదు. దాంతో ఈ మీటింగ్ లపై బాలయ్య షాకింగ్ కామెంట్స్ చేశారు. అయితే ఇప్పుడు ఇది చిరంజీవి వర్సెస్ బాలకృష్ణ ఇష్యూగా మారింది. ఈ విషయంపై నటుడు ప్రకాశ్ రాజ్ ఓ మీడియా ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించారు. ’ నాకు బాలయ్య బాబుగారు తెలుసు.. అలాగే అన్నయ్య చిరంజీవి గారు కూడా తెలుసు.

ఈ వివాదం విషయానికి వస్తే.. అన్నయ్య చిరంజీవి పెద్దగా ఉన్నారు.. ఓ నలుగురు కలిసి వెళ్లి ఆయనతో కూర్చుని మాట్లాడారు. అందులో పెద్ద విషయం ఉందని నేను అనుకోను. దానికి నన్ను పిలవలేదు.. మిమ్మల్ని పిలవలేదని అనుకోవడం కరెక్ట్ కాదు.చిరంజీవిగారికి పెద్దరికం ఉంది. ఇండస్ట్రీకి పెద్దన్నయ్య.. వాళ్లు మాట్లాడటం అయిన తరువాత పిలవాలనుకుంటే పిలుస్తారు. ప్రతి మీటింగ్‌కి అందరూ వెళ్లాల్సిన అవసరం లేదు కదా అని నేను అనుకుంటా. బాలయ్య బాబు గారికి పెద్ద మాట చెప్పడం కాదు కాని.. నాకైతే ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు. ఎందుకంటే చిరంజీవి అంటే ఆయనకు ఒక పెద్దరికం ఉంది.

ఓ నలుగురు కూర్చుని ఇష్యూ కోసం మాట్లాడి సమస్యకు పరిష్కారం ఆలోచించారు. తరువాత పిలుస్తారని అనుకోవచ్చు కదా.. ఈగోలు తప్పు.. ఇలాంటి ఈగోలను మీడియా కూడా పెద్దది చేయకూడదు. ఇలాంటి వాటిపై ఫోకస్ పెట్టడం అనవసరం’ అంటూ ప్రకాష్ రాజ్ చెప్పుకొచ్చారు. అయితే ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. బాలయ్య ఫ్యాన్స్ అయితే బాలయ్య కు పెద్దరికం లేదా.. ఆయన కూడా పెద్ద స్టార్.. ఆయన లేకుండా మీటింగ్ లు ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. ఇక మెగా ప్యాన్స్ మాత్రం ప్రకాశ్ రాజ్ చెప్పింది కరెక్ట్ అని మద్దుతు పలుకుతున్నారు.

Loading...