బిగ్ బాస్ 3 నాకు నచ్చలేదు : శివబాలాజీ

22313
actor siva balaji shocking comments on bigg boss season 3
actor siva balaji shocking comments on bigg boss season 3

బిగ్ బాస్ మూడో సీజన్ మరో రెండు వారాల్లో ముగియనుంది. 17 మంది కంటెస్టెంట్స్ తో మొదలైన ఈ షో 90 ఎపిసోడ్ లను కంప్లీట్ చేసుకుంది. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఏడు మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. ఈ ఏడుగురూ ఈ వారం నామినేషన్లో ఉన్నారు. మరి ఇందులో ఎవరు ఎలిమినేట్ అవుతారన్న దానిపై ప్రేక్షకులు అసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇక గత రెండు సీజన్ లతో పోల్చి చూస్తే.. ఈ సీజన్ లో కంటెస్టెంట్స్ వీక్ గా ఉండటంతో పాటు చూసే ప్రేక్షకులకు కావాల్సిన వినోదం దొరకడం లేదని చాలా మందే అంటున్నారు. ఇది ఇలా ఉంటే.. మూడో సీజన్ పై బిగ్ బాస్ 1 విన్నర్ శివబాలాజీ షాకింగ్ కామెంట్స్ చేశారు. బిగ్ బాస్ తో గుర్తింపు తెచ్చుకుని టైటిల్ విన్నర్ గా నిలిచిన శివ బాలాజీ అసలు బిగ్ బాస్ షోనే చూడటం లేదట. ఎందుకంటే.. ఆయనకు కావాల్సిన వినోదం అందులో లేదట.

అందుకే బిగ్ బాస్ సీజన్ 3 చూడటం లేదంటున్నారు శివ బాలాజీ. ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో శివ బాలాజీ మాట్లాడుతూ.. నాకు ఎంటర్‍టైన్మెంట్ అంటే చాలా ఇష్టం. అదెక్కడా ఈ సీజన్ లో కనిపించలేదు. అందుకే ఈ సీజన్ కు కనెక్ట్ కాలేదు. కొన్ని ఎపిసోడ్ లు చూశాను బోర్ గా అనిపించింది. తర్వాత కాస్త బీజీగా కూడా ఉండటం వల్ల మొత్తమే చూడటం మానేశాను అని శివబాలాజీ చెప్పుకొచ్చాడు.

Loading...