Saturday, April 20, 2024
- Advertisement -

స్టుపిడ్ పోలీస్.. అంటూ రెచ్చిపోయి తిట్టిన మాధవీలత..!

- Advertisement -

దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ఉన్న నేపథ్యంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోలీసులు పని చేస్తున్నారు. ఇంటి నుంచి బయటకు రాకండి. వస్తే దేశవ్యాప్తంగా ఎదుర్కోలేని సమస్య వస్తుందని చేతులు ఎత్తి దండం పెట్టి మరి చెబుతున్నారు. అయినప్పటికి జనం రోడ్లపై కనిపిస్తూనే ఉన్నారు. చాలా మంది యువకులు రోడ్లపై షికార్ చేస్తూ, గ్రౌండ్లో ఆటలాడుకుంటూ వ్యాధి తీవ్రతను గ్రహించక ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. దాంతో చెప్పిన వినకుండా రోడ్లపైకి వస్తే పోలీసులు బ్యాటింగ్ ఆడేస్తున్నారు. ఓరేంజ్‌లో ఉతికి ఆరేస్తున్నారు.

అయితే అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని ప్రభుత్వం చెప్పింది. కానీ పోలీసులు వచ్చిన వారు ఎందుకు వచ్చారో తెలుసుకోకుండా కొట్టి మాట్లాడుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దుబాయ్ నుంచి వచ్చిన తమ కొడుకుని విచక్షణా రహితంగా పోలీసులు కొడుతున్న వీడియో వైరల్ అవుతున్న ఈ సందర్భంలో ఇలాంటి వీడియోలనే మరికొన్నింటిని షేర్ చేస్తూ.. పోలీసులపై సంచలన వ్యాఖ్యలు చేశారు సినీనటి, బీజేపీ యువ నాయకురాలు మాధవీలత.

“కమాన్.. మైడియర్ సోషల్ మీడియా హీరోస్.. నీఛమైన కామెంట్స్‌తో నన్ను ఎటాక్ చేయడానికి గెట్ రెడీ’ అంటూ మొదలు పెట్టింది. ‘కారణం తెలుసుకోవాలి.. అతిక్రమిస్తే కేసులు పెట్టమన్నారు.. ఇలా కొట్టమననేదు. బ్లడీ స్టుపిడ్ పోలీస్.. మీరు డ్యూటీ చేస్తున్నారు ఓకే. వాళ్లు కూడా మనుషులే.. మీరు మనుషుల్లా ప్రవర్తించండి. బయటకు వస్తున్న ప్రజలంతా తప్పు చేస్తున్నట్టు కాదు. కారణం లేకుండా బయటకు రారు.. ఒకవేళ వస్తే ఇలా దారుణంగా కొట్టే బదులు వారికి జరిమానా విధించండి. వాళ్లు చేసిన తప్పుకు జరినామా సరిపోతుంది. ఇలా సైకోల్లా ప్రవర్తించాల్సిన అవసరం లేదు’ అంటూ పోలీసులపై రెచ్చిపోయింది మాధవీలత. అయితే మాధవీలత కామెంట్స్ పై నెటీజన్లు ఫైర్ అవుతున్నారు.

పోలీస్‌లను బ్లడీ స్టుపిడ్ పోలీస్ అంటావా? కాస్త గౌరవంగా మాట్లాడు. పోలీస్‌లు పనిలేక ఇలా రోడ్లు మీదికి వచ్చి డ్యూటీ చేస్తున్నారా? వాళ్లకు ఫ్యామిలీస్ ఉంటాయి. వాళ్లకి కూడా కరోనా వచ్చే ప్రమాదం ఉంది. కాని ఫ్యామిలీస్‌ను వదిలేసి దేశం మొత్తం సెలవుల్లో ఉన్నా వాళ్లు మాత్రం పగలూ రాత్రి కాకుండా ఉద్యోగం చేస్తున్నారు. ప్రజల్ని రక్షిస్తున్నారు. ఓ 24 గంటల పాటు డ్యూటీ చేయి. ఇదే మాట అప్పుడు చెప్పు. అప్పుడు తెలుస్తుంది నీకు నొప్పి అంటూ మాధవీలతపై ఫైర్ అవుతున్నారు.

మరికొంత మంది.. మాధవీలత వ్యాఖ్యలతో ఏకీభవిస్తూ.. పోలీస్‌లు మరీ ఓవరాక్షన్ చేస్తున్నారు. అత్యావసరాలకోసం రోడ్డుపైకి వస్తున్నా కారణం తెలుసుకోకుండా కొట్టడం తప్పు. వాళ్లకు ఇచ్చిన పవర్స్‌ని మిస్ యూజ్ చేస్తున్నారు. ప్రజలకు చెప్పే విధానం ఇదికాదు. ఒంటి మీద యూనిఫామ్, చేతిలో లాఠీ ఉంది కదా అని రెచ్చిపోవడం కరెక్ట్ కాదని అంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -