Friday, March 29, 2024
- Advertisement -

నటి హేమ దగ్గర అంత ఆస్తి ఉందా ?

- Advertisement -

టాలీవుడ్ లో లేడీ కమెడియన్ గా ముఖ్యమైన పాత్రలు పోషించి తనకంటూ ఓ ప్రత్యేకమైన క్రేజ్ సంపాధించుకుంది నటి హేమ. అయితే ఈ మధ్య ఆమె ఎక్కువగా సినిమాల్లో కనిపించడం లేదు. ఏదో అడపా దడపా తప్పిస్తే. ప్రస్తుతం ఆమెకి అవకాశాలు తగ్గాయి. అయినప్పటికి మా అసోసియేషన్ లో కీలక వ్యక్తిగా ఆమె కొనసాగుతున్నారు. ఇక హేమ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చారు.

త్రివిక్రమ్ తో గొడవ, పూరితో ఈమెకు ఉన్న అనుబంధం గురించి మాట్లాడింది. ఇక ఇదే ఇంటర్వ్యూలో హేమ తన ఆస్తుల గురించి కూడా చెప్పింది.
హేమ ఏ సినిమా చేసిన పది నుండి పాతిక లక్షలకు ఎక్కువ తీసుకునే ఛాన్స్ లేదు. ఈమెకు పారితోషకం ఈ మధ్య కాలంలో మరింత తగ్గింది. సినీ పరిశ్రమకు వచ్చిన తర్వాత హేమ ఆస్తులు పెద్ద ఎత్తున పెరిగాయని.. ప్రస్తుతం ఆమె అస్తి విలువ 300 కోట్లు అంటూ ప్రచారం జరుగుతోంది.

ఈమె దగ్గర కార్లు మరియు బంగారం కూడా భారీగా ఉందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మరి ఇంత ఆస్తి ఎలా సంపాధించారంటూ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు జవాబు ఇచ్చింది. బయట ప్రచారం జరుగుతున్నట్లు తన దగ్గర 300 కోట్ల ఆస్తులు ఏమీ లేవని.. కాకపోతే నాకు మొదటి నుండి ఆస్తులు ఉన్నాయని.. నా తల్లి గారు బాగా ఉన్న వారు అవ్వడం వల్ల నాకు మొదటి నుంచి కూడా బంగారం బానే ఉండేది.

అలా నా పేరుతో ఆస్తులు ఉన్నాయి తప్పిస్తే మరొకటి కాదు. అందుకే అందరు నాకు ఆస్తులు ఎక్కువ అని అనుకుంటారేమో అని చెప్పుకొచ్చింది. నా భర్త సినిమాటోగ్రాఫర్‌ అని, ఆయన బాగానే సంపాదిస్తుండని చెప్పుకొచ్చింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -