Saturday, April 20, 2024
- Advertisement -

సినీనటుల వలసలు.. దేనికి సంకేతం.?

- Advertisement -

సీనియర్ కమెడియన్ అలీ తనకు అత్యంత సన్నిహితుడైన స్నేహితుడు పవన్ కళ్యాన్ పార్టీ జనసేనను వదిలి వైసీపీలో చేరారు. తన ఆప్తమిత్రుడుపైనే విమర్శలు చేశారు. సినిమాల్లో భవిత లేదని నిర్ణయించుకొని రాజకీయాల బాట పట్టారు.

రంగుల ప్రపంచాన్ని కళాకారులు వదిలేస్తున్నారు. ఆ రంగంలో బతకడం అంత సులువు కాదని కాలదన్నుతున్నారు. మూడు నాలుగు దశాబ్ధాలుగా ఉన్న వారు కూడా సినిమాలు వేస్ట్.. రాజకీయాలు బెస్ట్ అంటూ వలసపోతున్నారు. రోజురోజుకు సినిమా అవకాశాలు తగ్గిపోతుండడం.. సినిమా ప్రపంచంలో బతకడం అత్యంత దుర్భరంగా మారిందన్న ఆవేదనలు ఆయా రంగాల్లోని నటుల నుంచి వ్యక్తమవుతున్నాయి.

సినిమా కష్టాలు అనుభవించలేక పలువురు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అందుకే భవిత కోసం ఇప్పుడు చాలా మంది రాజకీయాల బాటపడుతున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల వేళ అలీ సహా ఫృథ్వీ, పొసాని కృష్ణ మురళి, కృష్ణుడు, జీవితా రాజశేఖర్, చిన్నా పెద్ద సినీ నటులంతా మెజార్టీ వైసీపీకి, కొందరు టీడీపీకి మద్దతుగా రాజకీయ ప్రచారం చేశారు.

ఇప్పుడు తాజాగా అవకాశాలు తగ్గిపోయిన నటి హేమ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సినిమాలను వదిలేస్తున్నట్టు స్పష్టం చేశారు. తాను పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన హేమ ఈ మేరకు తాను రాజమండ్రిలో కొత్త ఇల్లు కూడా కట్టుకుంటున్నానని.. పూర్తిగా రాజకీయాల్లోనే కొనసాగాలని నిర్ణయించుకున్నట్టు స్పష్టం చేశారు..

ఇలా సినిమాల్లో భవిష్యత్ లేదని రాజకీయాల బాటపడుతున్న నటుల తీరు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -