Friday, April 26, 2024
- Advertisement -

బుల్లితెరపై కూడా వేధింపులు ఉన్నాయి.. రాత్రి రమ్మన్నాడు : నటి కళ్యాణి

- Advertisement -

సినీ ఇండస్ట్రీలో లైంగ్ వేధింపుల గురించి ఎప్పుడు ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది. ఆఫర్స్ కావాలంటే లొంగిపోవాల్సిందే అని ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ ఆరోపణలు చేశారు. తాజాగా ఇదే అంశంపై తమిళ నటి కళ్యాణి (పూర్ణిత) రియాక్ట్ అవుతూ ఓపెన్ అయింది. లైంగిక దోపిడి అనేది ఒక్క సినిమాల్లోనే కాదు బుల్లితెరపై కూడా ఉందంటూ తన అనుభవాలు చెప్పుకొచ్చింది. తన జీవితంలో ఎన్నో చేదు అనుభవాలున్నాయని తెలిపింది.

కేరళకు చెందిన ఈ అమ్మడు తమిళంలో పలు చిత్రాల్లో నటించింది. బాలనటిగా పరిచయమైన కల్యాణి కథానాయకి స్థాయికి ఎదిగింది. 10 చిత్రాలకు పైగా కథానాయకిగా నటించిన కల్యాణి ఆ తరువాత బుల్లితెరకు పరిచయమైంది. తరువాత బుల్లితెర నుంచి నిష్క్రమించింది. నటనకు దూరం కావడానికి కారణం ఏమిటన్న ప్రశ్నకు కల్యాణి బదులిస్తూ చాలా విషయాలు చెప్పింది. నటనకు దూరం కావడానికి కారణం లైంగిక వేధింపులు, కమిట్‌మెంట్ అంశాలే ప్రధాన కారణమని చెప్పుకొచ్చింది నటి కళ్యాణి. చాలా నిర్మాణ సంస్థలు ఫోన్ చేసి అవకాశం ఇస్తామని చెప్పేవారని, కాకపోతే అదే సమయంలో అడ్జెస్ట్‌మెంట్‌ కావాలని అడిగేవారని చెప్పింది.

మొదటి అడ్జెస్ట్‌మెంట్‌ అంటే కాల్‌షీట్స్‌కు సంబంధించిన పదం అనుకుని తన తల్లి ఓకే చెప్పేదని, కానీ.. ఆ తర్వాత అసలు అర్థం తెలియడంతో అడ్జెస్ట్‌మెంట్‌ అన్న పదం వినగానే ఫోన్‌ కట్‌ చేసేవాళ్లమని తెలిపింది. అలా వచ్చే అవకాశాలు అవసరం లేదనే ఉద్దేశ్యంతోనే ఫోన్ కట్ చేసేదాన్నని చెప్పింది కళ్యాణి. అయితే సినిమాల్లోనే కాదు బుల్లితెరపై కూడా ఇలాంటివి ఉన్నాయని.. తాను ఎదుర్కున్నానని చెప్పింది. ఓ టీవీ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా చేస్తున్నప్పుడు ఆ కార్యక్రమానికి సంబంధించిన పెద్ద వ్యక్తి రాత్రికి పబ్బుకు రావాలని అన్నాడని.. దానికి తాను కుదరదని చెప్పడంతో ఆ టీవీలో ఏ అవకాశం ఇవ్వలేదని.. ఇలాంటి పరిణామాల వల్లే నటనకు దూరం అయ్యాయని కళ్యాణి చెప్పింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -