Thursday, April 25, 2024
- Advertisement -

బాలయ్య సినిమా తో రీ ఎంట్రీ ఇవ్వనున్న సీనియర్ నటి

- Advertisement -

ఇప్పటికే ఇద్దరు సీనియర్ హీరోయిన్లు టబు మరియు విజయశాంతి చాలా కాలం తర్వాత ‘అల వైకుంఠపురం లో’, ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలతో మళ్ళీ తెలుగు ప్రేక్షకులను పలకరించనున్నారు. అయితే తాజాగా మరొక సీనియర్ నటి కూడా టాలీవుడ్ లోకి అడుగు పెట్టనున్నారు. ఆమె ఎవరో కాదు లైలా. ఈమెను మళ్ళీ తెలుగు ప్రేక్షకులను పలకరించేలా చేస్తోంది ఎవరో కాదు సీనియర్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ. ప్రస్తుతం బాలకృష్ణ తన 105 వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా షూటింగ్ నుండి ఒక ఆసక్తికరమైన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ ఫోటోలో స్టైలిష్ అవతారంలో నందమూరి బాలకృష్ణ మరియు సినిమాలో హీరోయిన్ సోనాల్ చౌహాన్ మాత్రమేకాక సీనియర్ నటి లైలా కూడా ఫోటోకి ఫోజు ఇచ్చారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన థాయిలాండ్ షెడ్యూల్ రెండు వారాల క్రితమే పూర్తయింది. మరోవైపు ఈ సినిమాలో భూమిక చావ్లా మరియు వేదిక కూడా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. బాలకృష్ణ ‘జైసింహా’ సినిమాకి దర్శకత్వం వహించిన కె ఎస్ రవి కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. బాలయ్య సినిమాతో సీనియర్ నటి లైలా తన సెకండ్ ఇన్నింగ్స్ లో ఎంతవరకు విజయం అందుకుంటుందో తెలియాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -