Friday, March 29, 2024
- Advertisement -

పవన్ పేరు వాడి ఉంటే వెళ్లిపో అనేవారు : మాధవీలత

- Advertisement -

‘నచ్చావులే’, ‘స్నేహితుడా’ సినిమాల్లో నటించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది మాధవీలత. ఇక సినిమాల్లో అవకాశాలు పెద్దగా రాకపోవడంతో ఇక రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. రెండేళ్ల క్రితం ఆమె బీజేపీ జెండా పట్టుకున్నారు. అయితే ఆమె పవన్ కళ్యాణ్ అభిమానిని అని చెప్పుకుని బీజేపీలో టికెట్ సాధించింది అని చాలా మంది అంటున్నారట. ఆ అభిప్రాయాలకు ఫుల్‌స్టాప్ పెట్టారు మాధవీ.

భారతీయ జనతా పార్టీ మాధవీలతకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడంతో గుంటూరు పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో పోటీ చేసారు. కానీ పోటీ చేసిన నియోజకవర్గంలో ఓడిపోయారు. “కాలేజ్‌ రోజుల్లో చదువుకుంటున్నప్పటి మెగాస్టార్ చిరంజీవి అభిమానిని. నా ఫ్రెండ్స్ మాత్రం పవన్ కళ్యాణ్ ఫొటోలు చూసి తెగ మురిసిపోతుండేవారు. నేను వారికి పవన్‌పై ఉన్న పిచ్చిని చూసి ఏం పవనే, ఆయనకు చిరంజీవికి వచ్చినంత యాక్టింగ్ వచ్చా, డ్యాన్స్ వచ్చా అని కామెంట్ చేసేదాన్ని. ఓసారి పవన్ ఇచ్చిన ఇంటర్వ్యూ చూసాను. ఆయనకు సమాజంపై ఇంత అవగాహన ఉందా అని అనిపించింది. ఆ ఇంటర్వ్యూ తర్వాతే ఆయనకు ఫ్యాన్ అయిపోయాను. నా రూంలోని గొడలకు పవన్ ఫొటోలే ఉండేవి. మా అమ్మ చూసి ఆయన ఫొటోలు ఎందుకు దేవుడు ఫొటోలు పెట్టుకోవచ్చుగా అనేది. నాకు పవన్ అంటే అంత ఇష్టం’’ అని మాధవి చెప్పింది.

అలానే “పవన్ అభిమాని అయి ఉండి.. జనసేనలో ఎందుకు చేరలేదని చాలా మంది అడిగారు. నేను బీజేపీలో చేరింది కూడా పవన్ కళ్యాణ్ పేరు చెప్పుకునే అని కామెంట్స్ కూడా చేసారు. కామన్ సెన్స్ ఉన్నవారు ఎవ్వరూ అలా మాట్లాడరు. ఎందుకంటే నేను బీజేపీలో చేరే సమయంలో జనసేనకు ఆ పార్టీకి ఎలాంటి పొత్తు లేదు. అలాంటప్పుడు నేను వెళ్లి పవన్ కళ్యాణ్ అభిమానిని నాకు సీటు ఇవ్వండి అంటే గెటౌట్ అంటారు. కానీ నేను బీజేపీలో చేరినప్పుడు పవన్ గారు మా పార్టీకి సపోర్ట్ చేస్తే బాగుంటుంది అని అనుకునేదాన్ని. నేను అనుకున్నట్లుగానే ఆయన మా పార్టీకి సపోర్ట్ చేసారు. నాకు చాలా సంతోషంగా ఉంది. కాబట్టి జనసైనికులు నేను బీజేపీలో ఉన్నందుకు హ్యాపీగా ఫీలవ్వాలి” అని మాధవీలత చెప్పింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -