నెటిజన్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన మాధవీలత..!

2655
actress madhavi latha strong reaction over netizens vulgar comments
actress madhavi latha strong reaction over netizens vulgar comments

కరోనా గురించి జనం ఓ పక్క భయంతో వణికిపోతుంటే.. కొంత మంది సెలబ్రిటీలు మాత్రం సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. లాక్ డౌన్‌తో సాధరణ ప్రజలు సైతం ఇంటికే పరిమితం అవుతుంటే యాంకర్ అనసూయ లాంటి బడా సెలబ్రిటీలు మాత్రం లాక్ డౌన్ అంటే మాకూ కష్టమే.. మేం వెళ్లి పనిచేసుకుంటాం.. మాకు మినహాయింపు ఇవ్వండి అంటూ కోరుతున్నారు.

ఓ పక్క భయంకరమైన వైరస్ వల్ల జనం పిట్టాలా రాలిపోతుంటే కొంచెమైనా బాధ్యత లేకుండా ఈఎంఐలు కట్టుకోవాలి.. ఇంటి అద్దె కట్టుకోవాలి అంటూ కోట్లు విలువచేసే కార్లలో తిరిగే ఇలాంటి సెలబ్రిటీలు బాధ్యతారాహిత్యంగా మాట్లాడటంపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ విషయంపై అనసూయను పచ్చి బూతులు తింటారు. దాంతో ఇలాంటి క్రిమినల్స్‌పై చర్యలు తీసుకోండి.. లేదంటే భవిష్యత్‌లో ప్రమాదం అంటూ హైదరాబాద్ సైబర్ క్రైమ్‌కి ట్విట్టర్ ద్వారా కంప్లైంట్ చేసింది అనసూయ.

ఈ ఇష్యూ హాట్ టాపిక్ అవుతుండగా.. మరో హీరోయిన్‌‌కి నెటిజన్లు చుక్కలు చూపిస్తున్నారు. సినీ నటి, బీజేపీ యువ నాయకురాలు మాధవీలత నెటిజన్లపై ఫైర్ అవుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. . ‘నీకు సినిమాలు లేవు కదా.. విలాసాలకు డబ్బులు ఎక్కడ నుంచి వస్తున్నాయ్’.. అని మాధవిలతను నెటిజన్లు ప్రశ్నించడంతో.. మాధవీలత అమ్మ, అక్క, చెల్లి అంటూ బూతులు మొదలుపెట్టింది. నేను ఎలా సంపాదిస్తే మీకు ఎందుకురా?? ఆడపిల్ల బయటకు వస్తే ఇక అలాగే సంపాదిస్తుందా? అంటూ నెటిజన్లను ఏకిపారేసింది. ఈ మధ్య ప్రతి ఒక్కడు మీకు డబ్బులు ఎక్కడ నుంచి వస్తున్నాయి అంటున్నారు.

ఎక్కడ నుంచి వస్తే నీకు ఎందుకురా? నీ గురించి నువ్ ఆలోచించుకో అంటూ ఫైర్ అయింది. నీ అమ్మకు.. అక్కకు.. చెల్లికి.. పెళ్లానికి ఎవడు ఇస్తున్నాడు డబ్బులు? అంటే ఆడపిల్ల ఎట్లాగైనా తిరిగి సంపాదిస్తుందనే నీచమైన ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి? మాకు కూడా తెలివి ఉంది. సినిమా ఒక్కటే శాశ్వతం కాదని మాకు కూడా తెలుసు. ఎలా బిజినెస్ చేసుకోవాలో తెలుసు.. వేరే విధంగా డబ్బులు ఎలా సంపాదించుకోవాలో మాకు తెల్సు. సినిమా అనేది పర్మినెంట్ కాదు. బ్లడీ అంటూ బూతులు తిడుతూ నెటిజన్లు వార్నింగ్ ఇచ్చింది.

Loading...