Friday, March 29, 2024
- Advertisement -

కత్తి మహేష్ కి వార్నింగ్ ఇచ్చిన నటి మధవీలత..!

- Advertisement -

సినీ విమర్శకుడు కత్తి మహేష్‌‌ ఇటీవలే హిందువుల ఆరాధ్య దైవం శ్రీ రాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంలో కత్తి మహేష్‌‌కి వార్నింగ్ ఇచ్చింది బీజేపీ యువనాయకురాలు, సినీ నటి మాధవీలత. ‘రాముడికి ఇష్టమైన వంటకం జింక మాంసం, నెమలి తొడ అని.. సీత, రాముడిని జింకను తెమ్మన్నది తినడానికే’ అంటూ అని కత్తి మహేశ్ చేసిన వ్యాఖ్యలపై హిందువులు భగ్గుమన్నారు. ఈ విధంగా కామెంట్స్ చేసినందుకు అతనిపై నాంపల్లి పీఎస్‌లో కేసు నమోదైంది.

అంతేకాకుండా రాష్ట్రంలోని పలు పోలీసు స్టేషన్లలో కూడా కత్తి మహేష్ పై ఫిర్యాదులు చేశారు. ఇక మాధవిలత మాట్లాడుతూ.. ” పవన్ కళ్యాణ్ ను తిటీ ఫేమస్ అయ్యాడు. అప్పట్లో రామాయణంపై ఇష్టానుసారం మాట్లాడి నగర బహిష్కరణకు గురయ్యాడు. మళ్లీ ఇప్పుడు శ్రీరాముడిపై కామెంట్స్ చేశాడు. సీతమ్మ జింకను తినిడానికి రాముడ్ని అడిగింది. అంతపురంలో సుఖించే వాడు. రాముడు ఏకపత్నీవ్రతుడు కాదు. మాంసాహారం తినేవాడు అంటూ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. అతను బాగా చదువుకున్నాడు.. చాలా నాలెడ్జ్ ఉన్నవాడే. కాని.. మనం చదువుకున్న చదువు ఏం నేర్పుతుంది? ఓ మనిషి నీతిగా ఎలా బతకాలి.. అన్నదానిపైనే జీవితం ఆధారపడి ఉంది.

దేవుళ్లుపై, రాజులపై ఎన్ని కథలు ఉన్నా.. క్రిష్ణుడు ఎనిమిది మంది భార్యల్ని చేసుకున్నాడని కథల్లో ఉన్నప్పటికీ మీరు కూడా ఎనిమిది మందిని చేసుకోమని ఎక్కడా చెప్పలేదు. ప్రతిదానికి ఒక మోరల్ స్టోరీ ఉంటుంది. మనిషి ఎలా బతకాలన్నదానికి ఆ స్టోరీస్ ఉపయోగపడతాయి. వాటిద్వారా మన లైఫ్‌ని ఎంత బాగా లీడ్ చేసుకోగలమో చెప్పడానికే ఈ కథలు ఉంటాయి. అవి తరతరాలకు ఉపయోగపడటానికి కథలుగా రాస్తారు. రామాయణంలో చెప్పారని వాళ్లు ఇలా చేశారు.. వీళ్లు ఇలా చేశారు.. రాముడు వందమందితో తిరిగాడు.. సీతమ్మ జింకను వేటాడుకుని తిన్నది అంటూ చెప్తున్నారీయన. ఇందులో మంచి ఎక్కడ కనిపిస్తుంది.

రాముడు మంచి వాడు అంటే మైండ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. రావణుడు రాక్షసుడు అంటే బాడీ వైబ్రేట్ అవుతుంది. ఎందుకంటే అది నెగిటివ్ సెన్స్. రాముడు ఈజ్ పాజిటివ్ సెన్స్.. రావణుడు ఈజ్ నెగిటివ్ సెన్స్. దేవుడు అంటే చిన్న సాయం చేసినా దేవుడే అవుతారు. రాముడు అయోధ్యను పరిపాలించినప్పుడు ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉన్నారు కాబట్టే ఆయన్న దేవుడు అన్నారు. ఇప్పటికీ దేవుడిగానే పూజిస్తున్నారు. నీకు దేవుడు అంటే నమ్మకం లేకపోతే మూసుకుని ఉండు. నమ్మేవాళ్ల విలువల్ని ఎందుకు చంపేస్తారు. ఆ హక్కు మీకెక్కడిది?” అంటూ మధవీలత ఫైర్ అయింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -