మీరా జాస్మిన్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా ?

1196
Actress Meera Jasmine unbelievable new look
Actress Meera Jasmine unbelievable new look

అందం అభినయంతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన నటి మీరా జాస్మిన్. అమ్మాయి బాగుంది చిత్రం ద్వారా తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మీరాజాస్మిన్ ఆ తర్వాత వరుస సినిమాల్లో నటించి ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. గుడుంబా శంకర్, భద్ర, రారాజు, మహారధి, గోరింటాకు, బంగారు బాబు వంటి చిత్రాలలో నటించింది మీరాజాస్మిన్.

కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం, కన్నడం ఇలా దక్షిణాది భాషల్లో అన్నింటిలో నటించిన మీరా 2014లో దుబాయ్కి చెందిన ఇంజనీర్ అనిల్ జాన్ ని వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్బై చెప్పేసి ఫ్యామిలీ లైఫ్ ను లీడ్ చేస్తున్న ఆమెకు ఒక పాప కూడా ఉంది. ఈ మధ్యకాలంలో మీరా లావుగా ఉన్న కొన్ని ఫొటోస్ వైరల్ అయ్యాయి. ఆమెని అలా చూసిన వారంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.

అయితే ప్రస్తుతం ఆమెకు సంబంధించిన మరికొన్ని ఫోటో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఫొటోలో మీరు చాలా సన్నబడ్డారు. మునపటి మీరాలా చాలా అందంగా సరికొత్త లుక్ లో కనిపిస్తున్నారు. అయితే త్వరలో మీరాజాస్మిన్ రీ ఎంట్రీ ఇవ్వబోతుందని అందుకే ఆమె తన లుక్ ను పూర్తిగా మార్చేసింది అని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. మరి ఆ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Loading...