Friday, April 26, 2024
- Advertisement -

ఒంటిపై ఉన్న టాటూ సీక్రెట్ చెప్పిన ప్రగతి ఆంటీ..!

- Advertisement -

సోషల్ మీడియాలో యంగ్ హీరోయిన్స్ తమ హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ.. ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటం మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్, అందులోనూ సీనియర్ నటి సోషల్ మీడియాలో దుమ్ము లేపుతోంది. ఆమె ఎవరో కాదు నటి ప్రగతి. ఈ లాక్ డౌన్ లో షూటింగ్స్ లేకపోవడంతో తన హాట్ హాట్ వర్కవుట్స్, డాన్స్ వీడియోలతో కుర్రాళ్ల మతి పోగొడుతోంది.

దీంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆమె హవానే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రగతిని ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూ చేయగా.. కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పింది. వెండితెరపై సాంప్రదాయ దుస్తుల్లో అమ్మగా, అత్తగా, అక్కగా పలు క్యారెక్టర్స్‌తో ఆకట్టుకునే ఆమె రియల్ లైఫ్ లో మాత్రం చాలా మోడ్రన్ డ్రెస్‌ల్లో కనిపిస్తూ ఉంటుంది. ఇక ఈ మధ్య డాన్స్ మాత్రం ఇరగదీస్తోంది. దాంతో ఆమె భుజంపై ఉన్న టాటూపై అందరి దృష్టి పడింది. తాజాగా జరిగిన ఈ ఇంటర్వ్యూలో తన ఒంటిపై ఉన్న టాటూల తాలూకు సీక్రెట్ తెలిపింది ప్రగతి.

చిన్నప్పుడు భుజానికి టీకా వేశారని, అక్కడ మరక కావడంతో అదే స్థానంలో టాటూ వేయించానని ఓపెన్‌గా చెప్పేసింది. అయితే అది వేశాకనే ఆ సూర్యుడిలోని శక్తి తన లోనూ ప్రవహిస్తూ, ఎప్పుడూ ఎనర్జీ ఇస్తోందని తెలిపింది. అయితే భుజంపైనే కాదు.. చేతులపై కూడా రెండూ టాటూలు ఉన్నాయి. చేతి మడిమపై ఓ టాటూ ఉండగా, ఉంగరం వేలిపై మరో టాటూ ఉంది. అయితే మడిమపై ఉన్న టాటూను బెస్ట్ ఫ్రెండ్‌కు గుర్తుగా వేయించుకున్నానని, ఉంగరం వేలిపై ఉన్న టాటూకు అర్థం క్వీన్ అని ప్రగతి చెప్పుకొచ్చింది.

పడక గదిలో కెమెరాలు పెడుతారా ?.. ఇత్తడయిపోద్ది : మాధవీలత

శృతీ హాసన్.. ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవడానికి కారణం ఇదే..!

నలుగురు పెళ్లాళ్లో.. మూడు సుధీర్ కే : రోజా

సోనూసూద్ ఆస్తి ఎన్నికోట్లో తెలుసా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -