అఖిల్ హీరోయిన్ ఆ హీరోతో ఎఫైర్ సాగిస్తుందా…?

1527
Sayesha saigal dating with kollywood hero arya
Sayesha saigal dating with kollywood hero arya

అక్కినేని అఖిల్ మొద‌టి సినిమా అఖిల్‌లో హీరోయిన్‌గా న‌టించింది సాయేషా సైగల్. ఈ సినిమా ప్లాప్ కావ‌డంతో తెలుగులో ఆమె పెద్ద‌గా అవ‌కాశాలు రాలేదు. దీంతో కోలీవుడ్‌కు షిఫ్ట్ అయింది సాయేషా. అక్క‌డ యంగ్ హీరోస్‌తో కొన్ని సినిమాల‌లో న‌టించి మంచి పేరు తెచ్చుకుంది ఈ భామ‌. తాజాగా సాయేషాపై ఓ రూమ‌ర్ హ‌ల్ చ‌ల్ చేస్తోంది. కోలీవుడ్ యంగ్ హీరోల‌లో ఆర్య ఒక‌రు. యూత్‌లో ఆర్య‌కు మంచి క్రేజ్ ఉంది.ప్ర‌స్తుతం ఆర్య‌తో సాయేషా ప్రేమాయణం సాగిస్తుందని కోలీవుడ్ మీడియా కథనాలు వ‌స్తున్నాయి.

ఆర్య‌,సాయేషా క‌లిసి ‘గజినికాంత్’ అనే సినిమాలో నటించింది. ఆ స‌మ‌యంలోనే వీరి మ‌ధ్య బ‌లం బ‌ల‌ప‌డింద‌ని తెలుస్తోంది. తాజాగా వీరిద్ద‌రు డేటింగ్‌లో ఉన్న‌ట్లు స‌మాచారం. తాజాగా వీరి ప్రేమ పెళ్లి వ‌ర‌కు కూడ వెళ్లింద‌ట‌. వీరి పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకారం తెలిపిన‌ట్లు వినికిడి.ప్రస్తుతం ఆర్య కెవి ఆనంద్ దర్శకత్వంలో ‘కాప్పాన్’ అనేసినిమాలో నటిస్తున్నాడు.అయితే వీళ్లిద్ద‌రి మ‌ధ్య చాలా వ‌య‌స్సు తేడా ఉంది. ఆర్య వ‌య‌స్సు 38 కాగ‌,సాయేషా వయసు 21 మాత్రమే. ఇద్దరి మధ్య 17 ఏళ్ల వయసు తేడా ఉంది. వ‌య‌స్సులో ఇంత తేడా ఉంటే ఎలా పెళ్లి చేసుకుంటార‌ని ప్ర‌శ్నిస్తున్నారు నెటిజ‌న్లు. అయిన ఈ రోజుల్లో వయస్సు గురించి ఎవ‌రు ప‌ట్టించుకుంటారులేండి.