బిగ్ బాస్ హౌస్ లో శర్వానంద్ కూతురు?

2432
Actress Punarnavi Bhupalam Contest in Bigg Boss Telugu Season 3
Actress Punarnavi Bhupalam Contest in Bigg Boss Telugu Season 3

బిగ్ బాస్ షో మరో నాలుగు రోజుల్లో మొదలు కానుంది అనుకుంటున్నా నేపథ్యం లో షో గురించి విపరీతం గా నెగటివిటీ నడుస్తుంది. అలాగే నాగార్జున ఈ సారి హోస్ట్ చేస్తూ ఉండటం తో నాగార్జున ఈ సారి ఎలా మెప్పిస్తాడు అనే విషయం కూడా అందరూ చర్చించుకుంటున్నారు. అయితే షో లో ఎవరెవరు ఉండబోతున్నారు అనేది కీలకం గా మారనుంది. ఈ విషయం పై ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు కానీ మీడియా లో మాత్రం రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

తాజాగా ఉయ్యాలా జంపాల సినిమా తో తెరంగేట్రం చేసిన పునర్నవి భూపాలం అనే హీరోయిన్ ఈ షో లో కి వస్తుంది అనే టాక్ వినిపిస్తుంది. ఈ హీరోయిన్ శర్వానంద్ కి కూతురు గా మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు అనే సినిమా లో నటించి అందరినీ మెప్పించింది. ఆ తర్వాత అడపా దడపా సినిమాలు చేసినా కానీ ఏవి పెద్దగా విజయవంతం అవ్వలేదు.

ఈ హీరోయిన్ బిగ్ బాస్ షో లో కి వస్తే ఎంత మంది ని ఆకర్షించగలదు అనేది మాత్రం వేచి చూడాల్సిందే. అంతే కాకుండా హిమజ, శ్రీముఖి,హేమ కూడా షో లో ఉన్నారని తెలుస్తుంది.

Loading...