వందల కోట్లు వద్దని.. మాములు అసిస్టెంట్ ను పెళ్లి చేసుకున్న రాశీ..!

1543
actress raasi real life love story and her proposal
actress raasi real life love story and her proposal

సీనియర్ హీరోయిన్ రాశీ తన కెరీర్ లో ఎన్నో మంచి సినిమాలు చేసింది. అయితే ఆమె లవ్ స్టోరీ గురించి చాలా మందికి తెలియదు. ఒక ఇంటర్వ్యూలో తన పెళ్లి ఎలా జరిగిందో చెప్పుకొచ్చింది. 1980లలోనే చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చింది రాశీ. తమిళ్ తెలుగు హిందీ అని తేడా లేకుండా అన్ని భాషల్లో సినిమాలు చేసింది. నిజం సినిమాలో బోల్డ్ క్యారెక్టర్ చేసింది.

ఇక ఆమె ప్రస్తుతం భర్తతో కలిసి హైదరాబాద్ లోనే ఉంటోంది. వారికి ఒక పాప కూడా ఉంది. అయితే తన లవ్ స్టోరీ అనుకోకుండా మొదలైందని రాశి ఒక ఇంటర్వ్యూలో వివరించింది. కెరీర్ లో సినిమాలు తగ్గుతున్న టైంలో సంబంధాలు చూడమని ఇంట్లో వాళ్లకు చెప్పిందట. వందల కోట్ల ఆస్తులున్న ధనవంతులు రాశీ కోసం వచ్చారట. కానీ వారు ఎందుకో కరెక్ట్ కాదని అనుకున్న రాశి ఒక సాధారణ యువకుడిని పెళ్లి చేసుకుంది. అతను ఎవరో కాదు.

పలు సినిమాలకు రాశితో పాటు సహాయక దర్శకుడిగా పని చేసిన శ్రీ ముని(SS.నివాస్). ఒక సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు షూటింగ్ ఎండ్ అయ్యే సమయంలో ఎవరో ఒకరిని ఆటపట్టించడం తనకు అలవాటాని చెప్పిన రాశి నివాస్ ని ఒక సారి ఆటపట్టించిందట. తన గురించి నేను ఒక స్పెషల్ విషయాన్ని చెప్పానని చెప్పు అని అసిస్టెంట్ ద్వారా నివాస్ కి తెలియజేసిందట రాశి. దీంతో నివాస్ కన్ఫ్యూజన్ కి గురయ్యి ఆ రెండు రోజులు ఏం చెప్పారని రాశి వెంటపడుతూ అడిగాడట. తరువాత చెబుతానని రాశి అతని ఫోన్ నెంబర్ తీసుకుంది.

ఇక ఆ తరువాత ఫోన్ చేసి ఏమి లేదని సరదాగా అన్నానని నిరుత్సాహ పరిచిందట. ఆ చిన్న సరదా సీన్ ద్వారా ఇద్దరం స్నేహితులుగా మారినట్లు రాశి చెప్పింది. కొన్ని రోజుల తర్వాత సడన్ గా నివాస్ ని పెళ్లి చేసుకుంటావా అని అడిగేసిందట రాశి. కానీ అతను రెండు రోజులు కన్ఫ్యూజన్ లోనే ఉన్నాడని తెలిపిన రాశి.. ఇద్దరం ఒక నిర్ణయానికి వచ్చిన తరువాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నట్లు తెలిపింది.

అందంగా ఉంటే వదలరు వీళ్ళు.. ప్రగతి ఆంటీ సంచలన వ్యాఖ్యలు

ఒంటరిగా రూంకి రమ్మన్నారు : వర్మ హీరోయిన్ అప్సరా రాణి

శృంగారం కోసమే అమ్మాయిగా మారలేదు : జబర్దస్త్ సాయితేజ (పింకీ)

శృతీ హాసన్.. ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవడానికి కారణం ఇదే..!

Loading...