Saturday, April 20, 2024
- Advertisement -

నన్ను లొంగ తీసుకునేందుకు ప్రయత్నించారు : రెజినా

- Advertisement -

తెలుగులో హీరోయిన్ గా ‘ఎస్.ఎం.ఎస్’ చిత్రంతో రెజీనా పరిచయం అయ్యింది. ఈ సినిమా తర్వాత ‘రొటీన్ లవ్ స్టొరీ’ ‘కొత్త జంట’ ‘పిల్లా నువ్వు లేని జీవితం’ ‘పవర్’ ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ వంటి హిట్ సినిమాల్లో నటించి మంచి జ్రేజ్ సంపాధించుకుంది. దాంతో ఈమెకు స్టార్ హీరోల సినిమాల్లో ఆఫర్స్ వస్తాయని అనుకుంది.

కానీ ఈమెకు చిన్న సినిమాలే ఇప్పుడు కరువయ్యాయి. ఎంతో గ్లామర్ ఉన్నా.. నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నా.. మంచి డ్యాన్సర్ అయినప్పటికి.. ఈమెకు కాలం కలిసి రావడం లేదు. ఇదిలా ఉంటే.. ఎంతో మంది నటీమణులు మీడియా వేదికగా.. వారు ఎదుర్కొన్న వేధింపుల గురించి చెబుతూనే ఉన్నారు. తాజాగా రెజీనా కూడా తన లైఫ్ లో ఎదుర్కున్న వేధింపుల గురించి చెప్పింది. రెజినా మాట్లాడుతూ.. “నేను చాలా సార్లు లైంగిక వేధింపులకు గురయ్యాను. నన్ను శారీరకంగా లొంగ తీసుకునేందుకు కొంతమంది ప్రయత్నించారు. అయితే అలా వేధించేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని నేనే జనంలో చితక్కొట్టాను.

అంతేకాకుండా నేను కాలేజ్ చదువుకునే రోజుల్లో చెన్నైలోని ఓ పాపురల్‌ థియేటర్ వద్ద కొంత మంది అబ్బాయిలు నన్ను వేధించారు. అంతేకాదు చెన్నైలోని ‘ఇగా థియేటర్‌ బ్రిడ్జ్‌’ వద్ద కొంత మంది అబ్బాయిలు నాతో పాటు నాకు తోడుగా వచ్చిన నలుగురు ఫ్రెండ్స్‌ను కూడా వేదింపులకు గురి చేశారు.అక్కడితో అయిపోలేదు నడిరోడ్డు పై కూడా ఓ వ్యక్తి నా పెదవులను తాకేందుకు ప్రయత్నించడం నన్ను ఎంతోగానో బాధపెట్టింది” అని రెజినా తన లైఫ్ లో జరిగిన సంఘటనలు చెప్పుకొచ్చింది.

హీరోయిన్ కళ్యాణి గుర్తుందా ? ఇప్పుడేం చేస్తుందంటే ?

రష్మీ గురించి షాకింగ్ విషయాలు చెప్పిన శిల్పా చక్రవర్తి..!

రజినీకాంత్‌కి కరోనా పాజిటివ్.. ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిన యాక్టర్..!

హీరో సాయిరాం శంకర్ ఫ్యామిలీని చూశారా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -