Thursday, April 25, 2024
- Advertisement -

అక్కినేని హీరో కి షాక్ ఇచ్చిన సాయి పల్లవి

- Advertisement -

‘అఖిల్’ సినిమాతో హీరోగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన అక్కినేని అఖిల్ ఇప్పటికి మూడు సినిమాల్లో నటించాడు కానీ ఒక్క సినిమా కూడా అఖిల్ కి మంచి విజయాన్ని ఇవ్వలేకపోయింది. ‘మిస్టర్ మజ్ను’ సినిమా తో మరొక డిజాస్టర్ ను అందుకున్న ఈ యువ హీరో ఇప్పుడు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తన 4వ సినిమా చేయబోతున్నాడు. నిజానికి ‘బొమ్మరిల్లు’ తప్ప భాస్కర్ కెరీర్ లో పెద్ద చెప్పుకోదగ్గ హిట్ సినిమాలు ఏమీ లేవు. అందుకే ఈ సినిమా తో బొమ్మరిల్లు భాస్కర్ మళ్లీ ఫామ్ లోకి రావాలని ప్రయత్నిస్తున్నారట.

నిజానికి ఈ సినిమాలో ఒక పెళ్లి చూపుల సీన్ షూటింగ్ చేయాల్సి ఉందట. కానీ హీరోయిన్ లేకపోవడం వల్ల షూటింగ్ వాయిదా పడుతూ వస్తోంది. ఇంతకుముందు సాయి పల్లవి ఈ సినిమాలో హీరోయిన్ గా నటించడానికి ఒప్పుకుంది. కానీ ఆఖరి నిమిషంలో అఖిల్ కు హ్యాండ్ ఇచ్చి సినిమా నుండి తప్పుకుంది. దీంతో మళ్లీ హీరోయిన్ వేట మొదలుపెట్టారు దర్శకనిర్మాతలు. రష్మిక మందన్న ని ఎంపిక చేద్దామనుకున్నారు కానీ ఆమె కాల్షీట్స్ను అడ్జస్ట్ చేయలేకపోతోంది. ‘బొమ్మరిల్లు’ సినిమా లో జెనీలియా పాత్ర కి ఎంత ప్రాధాన్యత ఉందో ఈ సినిమాలో కూడా హీరోయిన్ కి అంతే ప్రాధాన్యత ఉంటుందని చిత్రబృందం చెబుతోంది మరి ఆ పాత్ర దక్కించుకునే హీరోయిన్ ఎవరో ఇంకా తెలియాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -