అభిమానిపై సీరియస్ అయిన సమంత.. ఎందుకు ?

625
actress samantha akkineni warns fan
actress samantha akkineni warns fan

స్టార్ హీరోయిన్ సమంత తరచూ తిరుమల శ్రీవారిని దర్శించుకుంటూ ఉంటారు. ఇటీవలే ఆమె నటించిన ’జాను’ మూవీ రిలీజ్ అయ్యాక సమంత శ్రీవారిని దర్శించుకోవడానికి తిరుమల వెళ్లారు. అయితే ఆమె ఎప్పుడు తిరుమల వెళ్లినా కాలినడకే కొండ ఎక్కుతారు.

అయితే మొన్న వెళ్లినప్పుడు ఓ అభిమానికి సమంత వార్నింగ్ ఇచ్చింది. మెట్లు ఎక్కుతున్నప్పుడు ఓ యువకుడు సమంత ఫోటోలు తీశాడు. ఒక్క ఫోటో అనుకుంటే ఏమో.. కానీ పదే పదే తీస్తూనే ఉన్నాడు. దాంతో సామ్ కి కోపం వచ్చి.. “మర్యాదగా ప్రవర్తించు. నా ఫోటోలు తీయడం ఆపు” అంది. దాంతో ఆ యువకుడు సరే అన్నట్లు ఊరుకున్నాడు. ఆ టైంలో తీసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సమంత ఫ్యాన్స్ పై ఎప్పుడు చిరాకుపడిన సందర్భాలు లేవు.

ఫ్యాన్స్ ని ఎప్పుడూ చిరునవ్వుతో పలకరిస్తుంది. కానీ అప్పటికే మెట్లు ఎక్కుతూ అలిసిపోయిన సమంతకు ఎదురుగ్గా వచ్చి ఫోటోలు తీసేసరికి కాస్త కోపం వచ్చింది. ఇక తమిళంలో హిట్ అయిన ‘96’ సినిమాను తెలుగులో ‘జాను’ పేరుతో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. త్రిష, విజయ్ సేతుపతి పాత్రల్లో సమంత, శర్వానంద్ నటించారు. కానీ తమిళంలో హిట్ అయినంతగా తెలుగులో కాలేకపోయింది.

ఇక కలెక్షన్స్ విషయంలో కూడా ఈ సినిమా డల్ గానే ఉంది. సమంత, శర్వానంద్ ఈ సినిమాని రీమేక్ చేయొద్దు అనుకున్నారు. కానీ దిల్ రాజు పట్టు బట్టి వారితో జాను సినిమా తీశాడు. ఇక సమంత ప్రస్తుతం తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్ తెరకెక్కిస్తున్న ‘కాత్తు వాకుల రెండు కాదల్’ అనే సినిమాలో నటిస్తున్నారు.

Loading...