చైతు, సామ్ వాడే కార్లు ఇవే..!

623
Actress Samantha And Naga Chaitanya Luxery Cars and Bikes Collection
Actress Samantha And Naga Chaitanya Luxery Cars and Bikes Collection

ఏం మాయ చేసావే మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది సమంత. ఈ సినిమాలో చైతు హీరోగా నటించారు. ఆటోనగర్ సూర్య సమయంలోనే వీరి మధ్య ప్రేమ పుట్టింది. పెళ్లి తర్వాత సమంత సినిమాల్లో మరింత వేగం పెంచింది. ఆమె క్రేజ్ మరింత పెరిగింది. చైతు కూడా పర్వాలేదని అనిపిస్తున్నాడు.

అయితే వీరిద్దరూ ఖరీదైన గిఫ్ట్స్ ఇచ్చి పుచ్చుకున్నారట. చైతూకి ఎన్నో బైక్స్ , కారులు బహుమతిగా ఇచ్చిందట. ఎందుకంటే చైతూకి బైక్స్ ,కార్లు అంటే చాలా ఇష్టం. 2017జనవరి 29న జరిగిన నిశ్చితార్ధం చేసుకున్న వీళ్ళు 2017అక్టోబర్ 17న పెళ్లి చేసుకున్నారు. నిశ్చితార్ధం తరువాత ఎఫ్4బైక్ ని కొనిచ్చింది. దాని షోరూం ధర 27లక్షలు. తాజాగా కోటిన్నర పెట్టి డిఎమ్ డబ్ల్యు కారు సెవెన్ సీరీస్ కొనిచ్చిందట. పెట్రోలు,డీజిల్ రెండు అప్షన్స్ తో ఈ కారు నడుస్తుంది.

ఇక ఈ కారు నెంబర్ కోసం నాలుగున్నర లక్షలు ఖర్చుచేసాడట. ఇక ఇలాంటి కారే నాగార్జున 57వ పుట్టినరోజు సందర్బంగా కొన్నాడట. దీంతో అక్కినేని ఫ్యామిలీ దగ్గర ఇలాంటి కార్లు రెండు ఉన్నాయి. చైతు,సమంత ఇప్పటికే మరో మూడు లగ్జరీ కార్స్ వాడుతున్నారు. వీటి ఖరీదు 62లక్షలు,70లక్షలు,ఒక కోటి15లక్షలు విలువ కల్గిన కార్లవి. ఇక నాగ్, అఖిల్ ఇలా అందరికి కలిపి మరికొన్ని కార్లు ఉన్నాయి.

Loading...