ప్రేమకథ సినిమా చేస్తా అన్న అభిరామ్.. శ్రీరెడ్డి హీరోయినా అని సెటైర్లు..!

1216
actress Sri Reddy Followers Seterical Comments On Abhiram Daggubati
actress Sri Reddy Followers Seterical Comments On Abhiram Daggubati

ఆ మధ్య శ్రీరెడ్డితో రాసలీలలు సాగిస్తూ హాట్ టాపిక్ అయ్యాడు దగ్గుబాటి వారసుడు అభిరామ్. ఆమెతో ఏకంతంగా గడిపిన ఫోటోలు వీడియోలు శ్రీరెడ్డి బయట పెట్టడంతో దగ్గుబాటి అభిరాం పరువు పోయింది. దాంతో ఇది పెద్ద సంచలనం అయింది. ఇక అప్పటి నుంచి అభిరామ్ మీడియా ముందుకు రాలేదు. తాజాగా డి.రామానాయుడు బర్త్ డే వేడుకల్లో భాగంగా మీడియా ముందుకు వచ్చారు అభిరామ్.

ఈ సందర్భంగా తానూ హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు హింట్ ఇచ్చాడు. ఊహతెలిసినప్పటి నుంచి మా తాతా రామానాయుడుగారే నా ప్రపంచం. చిన్నప్పుడు ఆయనతోపాటు సినిమా షూటింగ్ లకు వెళ్లేవాడిని. ఆయన ఉండి ఉంటే ఈపాటికి నన్ను హీరోని చేసేవారు. నన్ను హీరోగా చూడాలన్నది తాతగారి కోరిక. ఇప్పుడు మా డాడీ సురేష్ బాబు గారు సపోర్ట్ చేస్తున్నారు. నాకు హీరో అవ్వాలన్నది. నిర్మాత కూడా ఆలోచన ఉంది.

మంచి ప్రేమకథతో ఈ ఏదాది లేదా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వస్తా. అన్నయ్య రానా పెళ్లి ఫిక్స్ కావడం చాలా హ్యాపీగా ఉంది. ఆగష్టులో పెళ్లి చేయాలని అనుకుంటున్నాం అని అభిరామ్ చెప్పుకొచ్చాడు. శ్రీరెడ్డితో ఇష్యూ జరిగిన తరువాత చాలా రోజులకి మీడియా ముందుకు వచ్చిన అభిరామ్ ని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. శ్రీరెడ్డితో జరిపిన రాసలీలల్ని ప్రస్తావిస్తూ వర్గర్ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. లవ్ స్టోరీ చేస్తానంటున్నావ్.. హీరోయిన్ శ్రీరెడ్డేనా అంటూ సెటైర్లు వేస్తున్నారు.

Loading...