Thursday, April 25, 2024
- Advertisement -

ఇదేమీ విజయం కాదు… ఇంకా చాలా సాధించాలి..

- Advertisement -

గత నెల రోజులుగా టాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్‌తోపాటు తెలుగువాళ్లకు అవకాశం ఇవ్వాలని పోరాటం చేస్తోన్న నటి శ్రీరెడ్డి, ఫిల్మ్ ఛాంబర్ ఎదుట అర్థనగ్న ప్రదర్శనకు దిగడంతో జాతీయంగానే కాదు, అంతర్జాతీయంగా ఈ ఘటన సంచలనంగా మారింది. ఫిల్మ్ చాంబర్ ముందు అర్ధనగ్న నిరసన తెలిపినందుకు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఆమెపై నిషేధం విధించింది.

అసోసియేషన్ ఆమెపై నిషేధం విధించింది. శ్రీరెడ్డి పోరాటం గురువారం కీలక మలుపు తిరిగి విషయం తెలిసిందే. అర్థనగ్న ప్రదర్శనను తీవ్రంగా పరిగణించిన కేంద్ర మానవ హక్కుల కమిషన్ ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వంతోపాటు కేంద్ర సమాచారా ప్రసార శాఖకు నోటీసులు జారీ చేసింది. దీంతో ఆఘ‌మేగాల‌మీద మా దిగొచ్చిన ఆమెపై విధించిన నిషేధాన్ని ఎత్తేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

మా తీసుకున్న నిర్ణ‌యంపై ఫేస్‌బుక్‌లో శ్రీరెడ్డి రియాక్స‌న్ గ‌ట్టిగానే ఇచ్చింది. దీనిపై తన ఫేస్ బుక్ ఖాతాలో స్పందించిన శ్రీరెడ్డి తనకు అండగా నిలిచిన వారికి కృత‌ఙ్ఞ‌త‌లు తెలుపుతూ, ‘సంధ్యా అక్కా, సంజయ అక్కా, దేవీ అక్కా, వసుధక్కా, అపూర్వక్కా… లవ్ యూ. ఇది విక్టరీ కాదు. సాధించాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి’ అని పేర్కొంది. ఈ పోరాటంలో తనకు సాయం చేయడానికి ముందుకొచ్చిన ఓయూ జేఏసీకి కూడా ఆమె ధన్యవాదాలు తెలిపారు. ‘ఉస్మానియా యూనివర్శిటీ అన్నలకి పాదాభి వందనమన్నా” అని పోస్టు చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -