Tuesday, April 23, 2024
- Advertisement -

ఎక్కువ మాట్లాడితే తాట తీ స్తాం….

- Advertisement -

ద‌క్షిణాది తార‌ల వ్య‌క్తిగ‌త విష‌యాల‌ను సింగ‌ర్ సుచిత్ర సుచీలీక్స్‌లాగా ఎలా బ‌య‌ట‌పెట్టిందో ఇప్పుడు శ్రీరెడ్డి లీక్స్ సినీ ఇండ‌స్ట్రీలో ప్ర‌కంప‌న‌లు రేపుతోంది. ఇండ‌స్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి బహిరంగంగా వ్యాఖ్యానించి సంచలనం రేపారు. ప‌బ్లిసిటీ కోస‌మే ఇలా చేస్తోంద‌ని కొంద‌రు వ్యాఖ్యానించారు.

శ్రీరెడ్డి వ్యాఖ్యలను హీరోయిన్ రకుల్‌ప్రీత్ సింగ్ పరోక్షంగా తప్పుబట్టారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన శ్రీరెడ్డి పబ్లిసీటీ కోసం తాము మీడియా ముందుకు రావడంలేదని రకుల్ ప్రీత్‌కు కౌంటర్ ఇచ్చింది. రకుల్ ప్రీత్, చెత్తగా మాట్లాడవద్దు.. నిన్ను వ్యక్తిగతంగా గౌరవిస్తారు.. కానీ కాస్టింగ్ కౌచ్ గురించి మేము మాట్లాడింది అబద్దమని పిచ్చి, పిచ్చి వ్యాఖ్యలు చెయ్యకు.. కోట్లకు కోట్లు పారితోషికం తీసుకునే నీకు, మా లాంటి వాళ్ల బాధ నీకేం తెలుసు.. నీ లాంటి వాళ్లను తెలుగు చిత్ర పరిశ్రమలో ఉంచకూడదనే మా ప్రయత్నం’ అని హెచ్చరించింది.

జిమ్‌లు పెట్టి వ్యాపారం కూడా చేస్తున్నావు, ఇదంతా తెలుగు ప్రేక్షకుల డబ్బు.. అప్పనంగా తింటున్నావు.. ఇక్కడ అవకాశాల కోసం ఎదురుచూసే వందలాది మంది కార్మికులు ఉన్నారు.. గుర్తించుకో ఎక్కువ మాట్లాడితే, తెలుగోళ్లం తాట తీస్తాం.. ఖబడ్దార్ బిడ్డా’ అంటూ తన ఫేస్‌బుక్ పేజ్‌లో పోస్ట్ చేసింది.

https://www.facebook.com/iamsrireddy/posts/2083048465275408

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -