Friday, April 26, 2024
- Advertisement -

ఆర్భాటాలు లేకుండా పెళ్లి చేసుకున్న స్వాతీ..

- Advertisement -

బుల్లితెరపై కలర్స్ స్వాతిగా సందడి చేసి, ఆ తర్వాత సినీ హీరోయిన్ గా మారిన స్వాతీ ఎలాంటి హడావిడీ లేకుండా తన ప్రియుడు వికాస్‌ను పెళ్లి చేసుకుంది. కేరళకు చెందిన మలేసియన్‌ ఎయిర్‌లైన్స్‌ పైలట్‌ వికాస్‌తో స్వాతి కొంతకాలం ప్రేమలో ఉంది. తమ ప్రేమను ఇంట్లో ఒప్పించి, పెద్దల ఆశీస్సులతో ఒక ఇంటిదయింది. ఇరు కుటుంబసభ్యుల సమక్షంలో వీరి వివాహం నిరాడంబరంగా జరిగింది.

గురువారం రాత్రి (ఆగస్టు 30)న తన కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య హైద‌రాబాద్‌లోనిరాడంబరంగా పెళ్లి చేసుకుని సర్‌ప్రైజ్ చేసింది. ఇండస్ట్రీకి చెందిన పెద్దలెవరూ లేకుండానే స్వాతి పెళ్లి చేసుకోవడం గమనార్హం. రిసెప్షన్ కేరళలోని కొచ్చీలో సెప్టెంబర్ 2వ తేదీన జరుగనున్నది. ఈ వేడుకకు కొద్దిమంది తెలుగు సినీ ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది.

గత కొద్దికాలంగా హీరో నిఖిల్ రెడ్డితో డేటింగ్ చేస్తున్నట్టు వార్తలకు ఈ పెళ్లితో చెక్ పడింది. గతంలో ఆమె ఆ వార్తలను ఖండించిన సంగతి తెలిసిందే. మా టీవి నిర్వహించిన కలర్స్ కార్యక్రమంతో పరిచయమైన స్వాతిరెడ్డి ఆ తర్వాత తెలుగు సినిమాకు పరిచయమైంది. అనంతరం తమిళ, మలయాళ రంగంలోకి ప్రవేశించింది. డేంజర్, సుబ్రమణ్యపురం, అష్టాచెమ్మా, స్వామిరారా తదితర చిత్రాల్లో నటించి మెప్పించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -