Friday, April 19, 2024
- Advertisement -

అది నాకు ముఖ్యం కాదు అంటున్నఆదా శర్మ

- Advertisement -

పూరి జగన్నాథ్ దర్శకత్వం లో వచ్చిన హార్ట్ అటాక్ అనే సినిమా తో తెలుగు సినిమా పరిశ్రమ కి పరిచయం అయినా హీరోయిన్ ఆదా శర్మ. ఆ సినిమా తర్వాత తెలుగు లో పెద్దగా అవకాశాలు రాలేదు కానీ మధ్యలో క్షణం అనే ఒక సినిమా మాత్రం హిట్ అయింది. మళ్ళీ చాన్నాళ్ళకి తెలుగు లో కల్కి అనే సినిమా తో ఆదా శర్మ తెలుగు ఆడియన్స్ ని పలకరించింది. ఓ మోస్తరు హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా కి సంబందించిన ప్రమోషన్స్ లో ప్రస్తుతం ఆదా బిజీ గా గడుపుతుంది. అయితే ఈ సినిమా లో ఒక డాక్టర్ పాత్ర లో నటించింది ఆదా.

ఆదా శర్మ ప్రమోషన్స్ లో మాట్లాడుతూ తక్కువ నిడివి ఉన్నా సినిమాలు చేయడానికి సిద్దమే అని చెప్పింది. సాధారణం గా తక్కువ నిడివి ఉన్న పాత్రలు చేయడానికి ఆదా శర్మ చూపిస్తున్న ఆసక్తి కి కారణం ఏంటి అని మీడియా అడిగినప్పుడు, తనకి నిడివి కన్నా పాత్ర ముఖ్యం అని, పాత్ర కథ నచ్చితే అది చిన్న పాత్ర అయినా చేయడానికి సిద్దమే అని చెప్పింది. ప్రస్తుతం తెలుగు లో అయితే సినిమాలు లేవు కానీ హిందీ లో మాత్రం ఒకటీ రెండు సినిమాలు చేస్తుంది ఆదా.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -