బట్టలు కొత్తగా ఉతుకుతున్న ఆదాశర్మ..!

698
Adah Sharma seen washing clothes on roof
Adah Sharma seen washing clothes on roof

ఏ.ఎన్.ఆర్, సావిత్రి జంటగా నటించిన ‘తోడికోడళ్ళు’ సినిమాలో ’ఆడుతూ పాడుతూ పనిచేస్తుంటే అలుపు సొలుపేమున్నది’ అనే పాట ఉంది. ఇది బాగా పేమస్ సాంగ్. ఎందుకంటే అప్పటి నుంచి ప్పటి వరకు ఎవరైన ఈ పాట గురించి తెలిసి ఉంటే.. వారు పని చేసేటప్పుడు ఈ పాట పాడుతూ పనులు చేసుకుంటూ ఉంటారు.

అయితే ఈ పాట పాడుతూ పని చేసుకుంటే పని తొందరగా అయిపోతుందని కూడా నమ్ముతారు. అయితే దానికి సరికొత్త డెఫినిషన్ చెబుతుంది ‘హార్ట్ ఎటాక్’ హీరోయిన్ ఆదా శర్మ. ఆడుతూ పాడుతూ కాదు సరికొత్త పద్దతిలో పనులు ఎలా చెయ్యాలో చెబుతుంది. ప్రధానంగా సరికొత్త విధానంలో బట్టలు ఎలా ఉతకాలో ఓ వీడియో చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఆదాశర్మ. బట్టలు ఉతకడం కూడా ఓ వ్యాయాయం లాంటిదే అని పెద్ద వాళ్ళు చెబుతుంటారు. కానీ మార్షల్ ఆర్ట్స్ పద్దతిలో కూడా బట్టలు ఉతకొచ్చు అని ఆదా శర్మ చెబుతోంది.

ప్రస్తుతం ఈ వీడియో బాగా వైరల్ అవుతోంది. ఇక ఆదాశర్మ.. పూరిజగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన హార్ట్ ఎటాక్ సినిమాలో నితిన్ సరసన నటించింది. తర్వాత ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ ’క్షణం’ ‘కల్కి’ వంటి సినిమాల్లో నటించింది. ఈమెకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. అందుకే ఎప్పటికప్పుడు తన ఫోటోలను, వీడియోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది.

Loading...