Friday, April 19, 2024
- Advertisement -

రాజ్ తరుణ్ సినిమా కి 65 లక్షలు డిమాండ్ చేసిన హీరోయిన్

- Advertisement -

యువ కథానాయకుడు రాజ్ తరుణ్ పక్కన హీరోయిన్ గా నటించడానికి పేరున్న హీరోయిన్లు ఎవరూ ఇంట్రెస్ట్ చూపించారు. దానికి కారణం ఒకటే. రాజ్ తరుణ్ సినిమాలకి అంత అటెన్షన్ ఉండదు. పైగా ఆయన సినిమా బడ్జెట్స్ అన్నీ తక్కువ గా ఉంటాయి. అందుకే ఇప్పటి వరకు ఈ హీరో కొత్త హీరోయిన్ల తో నే ఎక్కువ గా పని చేసాడు. కానీ సడన్ గా ఇండస్ట్రీ లో రాజ్ తరుణ్ పక్కన అదితి రావ్ హైదరి నటిస్తుంది అనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. కాకపోతే ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉంది అనే విషయం మీద క్లారిటీ కావలి.

ఒక లైలా కోసం, గుండె జారీ గల్లంతయ్యిందే సినిమాలు చేసిన విజయ్ కుమార్ కొండా కన్నడ పరిశ్రమ కి వెళ్ళి నిఖిల్ గౌడ తో సినిమా చేయాలని చాలా కలం వేచి చూసాడు కానీ ఇప్పుడు అది జరిగేట్టు కనిపించడం లేదు. ఆల్రెడీ ఈ దర్శకుడు రాజ్ తరుణ్ కి ఒక కథ చెప్పి హీరో ని ఒప్పించాడట. అయితే ఈ సినిమా కోసమే అదితి రావ్ ని హీరోయిన్ గా తీసుకోవాలని అనుకుంటున్నారట. పాత్ర కి ప్రాధాన్యత లేనిదే అదితి రావ్ సినిమా ఒప్పుకోదు, అలాంటిది ఈ సినిమా ని ఒప్పుకుందా, లేక ఒప్పుకుంటుందా అనే డైలమా నడుస్తుంది.

అంతే కాకుండా అదితి రావ్ ని తీసుకోవాలంటే మినిమమ్ 65 లక్షల వరకు పారితోషికం ఇచ్చుకోవాలి నిర్మాత. సో అసలు ఈ ప్రాజెక్ట్ నిజం గా చర్చల్లో ఉందా లేదా అనేది తెలియాలంటే హీరో కానీ దర్శకుడు కానీ ఓపెన్ అవ్వక తప్పదు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -