Wednesday, April 24, 2024
- Advertisement -

హైద‌రాబాదీ, బెంగాలీ ప్రేమ‌క‌థ‌ ‘2 స్టేట్స్’ పోస్ట‌ర్‌

- Advertisement -

హిందీలో సూపర్ హిట్‌గా నిలిచిన 2 స్టేట్స్‌ను తెలుగులో అదే పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఆ సినిమాలో అడివి శేష్ హీరోగా న‌టిస్తున్నాడు. రెండు ప్రాంతాల వ్య‌క్తుల మ‌ధ్య ప్రేమ క‌థ‌గా ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమాకు సంబంధించిన పోస్ట‌ర్ ఇటీవ‌ల విడుల‌య్యింది. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు వెల్ల‌డించారు.

విభిన్న ప్రాంతాలకు చెందిన వ్యక్తులు ప్రేమికులుగా మారుతారు. రెండు వేర్వేరు ప్రాంతాల‌కు చెందిన వారు కలవడం పాయింట్‌గా సినిమా ఉంటుంది. హిందీలో గుజరాతీ అండ్ మద్రాసీ అనే థీమ్‌తో తీయ‌గా తెలుగులో కొంచెం మార్చారు. ఈ సినిమాలో అబ్బాయి హైదరాబాదీ కాగా.. అమ్మాయి బెంగాల్‌గా సినిమా తీస్తున్నారు. ఈ సినిమా పోస్ట‌ర్‌ను చూస్తుంటే మధ్యలో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీను నిలబెట్టారు. అమ్మాయి అబ్బాయి చేతులు క‌లిపి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, హైద‌రాబాద్ చార్మినార్ వ‌ద్ద ఉన్న పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు.

ఆ పోస్ట‌ర్‌లో ఈ సినిమా షూటింగ్ ఎక్క‌డ ప్రారంభ‌మ‌వుతుందో తెలిపారు. ఈ పోస్ట‌ర్‌ను హీరో అడివి శేష్ విడుద‌ల చేసి ఆహ్వానించాడు. మార్చి 24వ తేదీన హైద‌రాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఉదయం 8 గంటలు ముహూర్తం షాట్ తీస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. ఈ సినిమా వెంకట్ కుంచం దర్శకత్వంలో రూపొందుతోంది. హీరో రాజశేఖర్ కూతురు శివాని హీరోయిన్‌గా పరిచయమ‌వుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -