Friday, March 29, 2024
- Advertisement -

జబర్దస్త్ కి కొత్త గ్లామర్

- Advertisement -

ప్రస్తుతం తెలుగు బుల్లి తెర మీద విపరీతమైన క్రేజ్ తో ఆకట్టుకొనే షో ఏదైనా ఉంది అంటే అది కచ్చితంగా జబర్దస్త్ షో అని చెప్పుకోవచ్చు. ఈ షో ఎంతలాగా ప్రేక్షకాదరణ పొందింది అంటే, షో లో పాల్గొనే నటులు అందరూ బయట ఫుల్ బిజీ అయిపోయారు. ప్రతీ వారం ఈ షో కి వస్తున్న రేటింగ్స్ ని ఇంక వేరే ఏ షో బీట్ చేయలేని స్థితి కూడా నెలకొంది. అప్పట్లో ఎన్నికల సమయం లో రోజా, నాగబాబు బదులు ఈ షో కి జడ్జెస్ గా మీనా, శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ ని తీసుకున్నారు నిర్వాహకులు.

అనుకున్న దాని కంటే తక్కు సమయం లో నే రోజా ఈ షో కి జాయిన్ అయిపోవడం తో డాన్స్ మాస్టర్లు ఇద్దరూ రావడం ఆగిపోయింది. ప్రస్తుతం రోజా మరియు మీనా కలిసి జడ్జెస్ గా చేస్తూ ఉండడం మనం చూసాము. అయితే ఇప్పుడు నాగబాబు ప్లేస్ లో ప్రస్తుతం కొన్ని రోజులకి కన్నడ నటి సంఘవి ని తీసుకున్నారు. సంఘవి చాలా తెలుగు సినిమాల్లో నటించి అందరి మన్ననలు పొందిన విషయం మనకి తెలిసిందే. అయితే సంఘవి ఎన్ని రోజులు షో లో కొనసాగుతుంది అనే విషయం మీద క్లారిటీ రావాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -