Thursday, April 25, 2024
- Advertisement -

నితిన్ కోలుకోవడానికి పది నెలలు పట్టింది

- Advertisement -

వరుస పరాజయాల తర్వాత వచ్చిన ఇష్క్ సినిమా నితిన్ కెరీర్ కి బాగా హెల్ప్ అయింది. ఆ సినిమా విజయం నితిన్ ని మళ్ళి ఇండస్ట్రీ లో వెనక్కి తిరిగి చూసుకొనే పరిస్థితి నుండి బయట పడేసింది. ఆ తర్వాత కొన్ని ఫ్లాప్ సినిమా లు చేసినా కానీ నితిన్ ని అవి పెద్ద గా ఇబ్బంది పెట్టలేదు కానీ ఇటీవల కాలం లో వరుస గా రెండు మూడు ఫ్లాపులు ఇవ్వడం మాత్రం నితిన్ ని ఇరకాటం లో పడేసింది. తాను ఎటువంటి సినిమాలు చేస్తున్నాడు, ఇప్పుడు ఇటువంటివి చేయాలి అని ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడటం తో నితిన్ కొద్దీ రోజులు సినిమాలు ఏమి చేయకుండా అలా ఖాళీ గా ఉండిపోవటానికి ఇష్టపడ్డాడు.

శ్రీనివాస కళ్యాణం ఎవరినీ పెద్ద గా మెప్పించలేకపోయింది.ఆ సినిమా విడుదల అయిన పది నెలల కి ఇప్పుడు ఈ రోజు నితిన్ తన కొత్త సినిమా ని అధికారికం గా ప్రారంభం చేసాడు. భీష్మ అనే టైటిల్ తో రాబోతున్న ఈ సినిమా కి దర్శకుడు వెంకీ కుడుములు. ఈ సినిమా లో రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది. సూర్యదేవర నాగ వంశీ సితార ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ లో ఈ సినిమా ని నిర్మిస్తుంది.

దీని బట్టి చూస్తే దాదాపు పది నెలల సమయం పట్టింది నితిన్ కి ఒక కొత్త సినిమా తో రావడానికి!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -