Thursday, April 25, 2024
- Advertisement -

భారతీయుడు 2 సినిమా నుంచి తప్పుకున్న హీరోయిన్

- Advertisement -

ఈ మధ్యనే ‘2.O’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రముఖ దర్శకుడు శంకర్ ఇప్పుడు 1996లో విడుదలై బ్లాక్ బస్టర్ అయిన తన ‘భారతీయుడు’ సినిమాకి సీక్వెల్ అయిన ‘భారతీయుడు 2’ సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సంవత్సరం జనవరిలోనే షూటింగ్ మొదలైంది కానీ రెండు మూడు నెలల్లోనే బడ్జెట్ విషయంలో తేడాలు వచ్చి సినిమా ఆగిపోయింది. దాదాపు ఏడు నెలల పాటు హోల్డ్ లో ఉన్న ఈ ప్రాజెక్టు షూటింగ్ మళ్లీ ఈ మధ్యనే మొదలైంది. తాజాగా ఈ సినిమా కోసం కోలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ను ఎంపిక చేశారు దర్శక నిర్మాతలు.

కానీ తాజాగా ఐశ్వర్య రాజేష్ దర్శకనిర్మాతలకు చిత్ర బృందానికి షాక్ ఇస్తూ ఆఖరి నిమిషంలో సినిమా నుంచి తప్పుకుంది. దీంతో సినిమా షూటింగ్ మళ్ళీ వాయిదా పడింది. డేట్స్ కుదరక పోవడం వల్ల తనే స్వయంగా ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు ఐశ్వర్య రాజేష్ మీడియా తో మాట్లాడుతూ చెప్పింది. కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది. రకుల్ ప్రీత్, సిద్ధార్థ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ సినిమా ని లైకా ప్రొడక్షన్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -