Thursday, April 25, 2024
- Advertisement -

అభిమాన హీరో కోసం తండ్రినే చంపేయ‌త్నం..

- Advertisement -

త‌మిళ‌నాడులో అభిమానానికి ఎంత‌టి విలువ‌నిస్తారో అంద‌రికి తెలిసిందే. ఇక ఈ విష‌యంలో సినీ అభిమానులు ఓ అడుగు పైనే ఉంటారు. త‌మిళ‌నాడులో త‌మ అభిమాన హీరో కోసం ప్రాణాలు ఇచ్చేస్తారు.అయితే అభిమాన హీరో కోసం ప్రాణాలు తీసిన వారు కూడా చాలామంది ఉన్నారు. తాజాగా అభిమాన హీరో సినిమా చూడ‌టానికి క‌న్నా తండ్రినే చంపాల‌ని చూశాడు ఓ ప్ర‌బుద్దుడు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే… హీరో అజిత్‌కు త‌మిళ‌నాడులో ఎంత‌టి ఫాలోయింగ్ ఉందో తెలిసిందే.

ర‌జ‌నీకాంత్ త‌రువాత అంత‌టి ఫాలోయింగ్ ఉంది ఒక్క అజిత్‌కే. తాజాగా అజిత్ న‌టించిన విశ్వాసం సినిమా గురువారం విడుద‌లైంది. అజిత్ కుమార్ అనే యువకుడు అజిత్‌కు వీరాభిమాని. దీంతో సినిమాను మొద‌టి రోజు మొద‌టి షో చూడల‌ని భావించాడు. కాని సినిమా చూడ‌టానికి త‌న తండ్రి డ‌బ్బులు ఇవ్వ‌లేదు. కోపంతో అజిత్‌కుమార్‌ తండ్రిపై పెట్రోల్‌పోసి తగులబెట్టడానికి ప్రయత్నించాడు. ఈ సంఘ‌ట‌న‌లో తండ్రికి తీవ్ర గాయాలు అయిన‌ట్లు తెలుస్తోంది. పోలీసులు అజిత్‌కుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -