అఖిల్ నెక్స్ట్ మూవీ దర్శకుడు ఎవరంటే..?

324
akhil next movie with surender reddy
akhil next movie with surender reddy

తొలి సినిమాలు ఢీలా పడడంతో అక్కినేని అఖిల్ నాల్గో సినిమాపై అంచనాలు పెట్టుకున్నాడు.. బొమ్మరిల్లు భాస్కర్ తో చేస్తున్న ఈ సినిమా కి బ్యాచిలర్ అనే టైటిల్ ని ఫిక్స్ చేయగా ఈ సినిమా లోని ఓ పాట ఇప్పటికే అందరిని ఆకట్టుకుంటుంది. పూజ హెగ్డే కథానాయికగా నటిస్తుండగా గోపి సుందర్ మ్యూజిక్ ఈ సినిమా కి ప్లస్ అంటున్నారు. గీత ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తుంది..

కరోనా కారణంగా ఈ సినిమా రిలీజ్ వాయిదా పడగా త్వరలోనే ట్రైలర్ ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. బొమ్మరిల్లు లాంటి సూపర్ హిట్ సినిమా చేసిన భాస్కర్ చాలా రోజుల తర్వాత చేస్తున్న సినిమా ఇది.. అయితే గత కొన్ని రోజులుగా వస్తున్నట్లు అఖిల్ నాల్గో సినిమా కి సిద్ధమవుతున్నాడు..

తాజాగా అఖిల్ తదుపరి చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. సురేందర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనుండగా… అనిల్ సుంకర నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయాన్ని అఖిల్ ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు. ఈ ప్రాజెక్ట్ తనకు ఎంతో ప్రత్యేకమైనదని చెప్పాడు. త్వరలోనే షూటింగ్ స్టార్ట్ అవుతుందని తెలిపాడు.

Loading...