Tuesday, April 16, 2024
- Advertisement -

ఇదైనా ప‌క్కానా అఖిల్‌! వెంకీ అట్లూరితో సినిమా అంట‌

- Advertisement -

అఖిల్ సినిమాతో టాలీవుడ్‌కు హీరోగా పరిచ‌య‌మైన అక్కినేని రెండో వార‌సుడు అఖిల్ త‌న మూడో సినిమా చేయ‌డానికి త‌ట‌ప‌టాయిస్తున్నాడు. సినిమా ఎవ‌రితో చేయాలి? ఎవ‌రితో చేస్తే సినిమా హిట్ అవుతుంది? అని భావిస్తూ అంద‌రి ద‌ర్శ‌కుల‌తోనూ చ‌ర్చోప‌చ‌ర్చ‌లు చేస్తున్నాడు. ఇప్ప‌టివ‌ర‌కైతే తొలి సినిమాతోనే హిట్ సినిమా తీసిన ద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరితో చేయ‌నున్నాడ‌ని స‌మాచారం. ఇదైనా ప‌క్కానా లేదా తెలియ‌డం లేదు. కానీ వెంకీతోనే సినిమా ఉంటుంద‌ని స‌మాచారం.

వెంకీ అట్లూరి వ‌రుణ్‌తేజ్‌తో ‘తొలిప్రేమ‌’ సినిమా చేసి మంచి హిట్ కొట్టాడు. ఇప్పుడు అఖిల్‌తో సినిమా చేయ‌డానికి సిద్ధ‌మ‌య్యాడ‌ని టాక్‌. ఈ సినిమాను బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా వ్య‌వ‌హ‌రిస్తున్నాడని, మార్చి 26వ తేదీన అధికారికంగా ఈ సినిమా కార్య‌క్ర‌మాలు ప్రారంభ‌మ‌వుతాయ‌ని తెలుస్తోంది. వెంకీ చెప్పిన పాయింట్ నచ్చడంతో నాగార్జున ఈ స్క్రిప్ట్‌ను ఓకే చేశారని ఇండ‌స్ట్రీలో వినిపిస్తోంది. ప్ర‌స్తుతం స్క్రిప్ట్ రాయ‌డంలో వెంకీ బిజీగా ఉన్నాడు. అయితే అధికారికంగా ప్రారంభించే దాక అఖిల్ సినిమా ఇతడితో ప‌క్కా అని భావించ‌లేం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -