Saturday, April 20, 2024
- Advertisement -

సిక్స్ ప్యాక్‌లో అఖిల్ ..!

- Advertisement -

అక్కినేని న‌ట‌వార‌సుడిగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ త‌ను న‌టించిన రెండు సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ను తీవ్రంగా నిరాశ పర్చాడు. దీంతో అఖిల్‌పై ఒత్తిడి ఎక్కువైంది. తొలిప్రేమ లాంటి డీసెంట్ హీట్ కొట్టిన వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వంలో మిస్ట‌ర్ మ‌జ్ను సినిమాలో న‌టిస్తున్నాడు అఖిల్‌. తాతగారి జయంతి సందర్భంగామిస్టర్ మజ్ను’ టీజర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక అమ్మాయిల మనసులు కొల్లగొట్టాలంటే ఇలాంటి చమత్కారాలు గడుసు మాటలు మాత్రమే సరిపోవు… జనరేషన్ మారింది కదా. ఇప్పుడు ఆరుపలకలు చాలా ఇంపార్టెంట్.

తాజాగా అఖిల్ సిక్స్ ప్యాక్ లుక్‌లో క‌నిపించి అంద‌రికి షాక్ ఇచ్చాడు. త‌న సిక్స్ ప్యాక్‌ను పెద్ద అద్దం ముందు నిలబడి సెల్ఫీ తీసుకుని ఇన్స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. అఖిల్ సిక్స్ ప్యాక్‌పై స్పందిస్తు.. . “నేను రెడీ! షర్టు లేకుండా షూటింగ్ కోసం కాదు. ప్రియమైన నాన్నతో వెకేషన్ కు వెళ్లేందుకు. కానీ ఒక్క క్షణంలో నేనిలా ఉన్నానేంటి అని నాకనిపించేలా చేస్తాడు. అందుకే ఇది నాకు తప్పదు. ఈ షెడ్యూల్ లాస్ట్ డే షూట్ ఈ రోజు. అయితే ఫ్యామిలీ వెకేషన్ ఇలా ష‌ర్ట్ విప్పి మ‌రి జ‌నాల‌కు చూపించాలా అని నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక మిస్ట‌ర్ మ‌జ్ను సినిమాను సంక్రాంతి బ‌రిలో నిల‌పాల‌ని ప్లాన్ చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -