Wednesday, April 24, 2024
- Advertisement -

విడుదల సెంటిమెంట్ కోసం స్ట్రెస్ అవ్వనున్న నాగార్జున?

- Advertisement -

నాగార్జున అక్కినేని ప్రధాన పాత్ర లో రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం లో, కీర్తి సురేష్, సమంత, రకుల్ ప్రీత్ సింగ్ కలిసి నటిస్తున్న చిత్రం మన్మధుడు 2. అప్పుడెప్పుడో విడుదల అయ్యి సంచలనం సృష్టించిన మన్మధుడు సినిమా కి సీక్వెల్ గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కి సంబందించిన టీజర్ ని ఇటీవలే చిత్ర యూనిట్ యు ట్యూబ్ లో విడుదల చేశారు. అయితే ఈ సినిమా ఆగస్టు 9 న విడుదల కానుంది. ఇది విడుదల అయినా వెంటనే నాగార్జున కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం లో మరో చిత్రాన్ని మొదలు పెట్టి దానిని సంక్రాంతికి విడుదల చేయాలనే ప్లాన్ లో ఉన్నారట.

నిజానికి వచ్చే నెల నుండి బిగ్ బాస్ షో మొదలు కానుంది. ఇది అక్టోబర్ మొదటి వారం వరకు సాగనుంది. అంటే అక్టోబర్ వరకు సినిమా షూటింగ్ ని హైదరాబాద్ లో నే పెట్టుకుంటే మంచిది, లేదంటే వారాంతానికి వేరే వూరు నుండి నాగార్జున హైదరాబాద్ కి రావాల్సి ఉంటుంది. అంతే కాకుండా బిగ్ బాస్ ఉండే రెండు రోజుల షూట్ కి నాగార్జున చాలా కష్టపడాలి. ఈ సారి అంచనాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వారం లో మూడు రోజులు నాగార్జున బిగ్ బాస్ కి వెచ్చించి ప్రిపేర్ అవ్వాలి.

సో బ్యాక్ టూ బ్యాక్ అటు బంగార్రాజు షూటింగ్, ఇటు బిగ్ బాస్ షూటింగ్ తో తీరిక లేకుండా పడడం కన్నా ప్రశాంతం గా రెండిటినీ బాలన్స్ చేసుకుంటే బాగుంటుంది అనే ఆలోచన నాగార్జున లో మొదలైందట. ఒకవేళ అదే జరిగితే ఆయన అనుకున్నట్లు సోగ్గాడే చిన్ని నాయన లాగా బంగార్రాజు ని సంక్రాంతి కి విడుదల చేయలేరు. మరి విడుదల సెంటిమెంట్ కోసం అనవసరమైన స్ట్రెస్ ని నాగార్జున ఏ మేరకు తీసుకుంటారు అనేది వేచి చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -