గోల్ఫ్ ఆడుతున్న టాలీవుడ్ కింగ్

266
Akkineni Nagarjuna turns golf player
Akkineni Nagarjuna turns golf player

ఈ మధ్యనే ‘దేవదాసు’ సినిమాతో మరొక డిజాస్టర్ అందుకున్న టాలీవుడ్ కింగ్ నాగార్జున ప్రస్తుతం తన సూపర్ హిట్ సినిమా ‘మన్మధుడు’ కి సీక్వెల్ గా ‘మన్మధుడు 2’ సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ‘చిలసౌ’ సినిమాతో దర్శకుడిగా మారిన రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండగా స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ పోర్చుగల్ లో శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమా సెట్స్ నుంచి లీక్ అయిన కొన్ని ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

తాజాగా బయటకు వచ్చిన ఒక ఫోటో లో నాగార్జున గోల్ఫ్ ఆడుతూ కనిపించాడు. హీరోగా మారి ఎన్ని దశాబ్దాలు గడిచినా ఇంకా అదే ఫిట్నెస్ మెయింటైన్ చేస్తూ నాగార్జున నిజంగానే మన్మధుడు అనిపించుకుంటున్నాడు. యంగ్ అండ్ డైనమిక్ గా నాగార్జున కనిపిస్తున్న ఈ ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఇక ఈ చిత్ర షూటింగ్ షెడ్యూల్ పోర్చుగల్ లో పూర్తవగానే హైదరాబాద్లో షూటింగ్ జరగనుంది. ఈ షెడ్యూల్ కూడా పూర్తయితే సినిమా షూటింగ్ దాదాపు 80% పూర్తి అయినట్లే. కీర్తి సురేష్, సమంత, అక్షర గౌడ లు ఈ సినిమాలో క్యామియో పాత్రల్లో కనిపించబోతున్నారు అని తెలుస్తోంది.

Loading...